జాలీ వర్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాలీ.. డబుల్ ట్రబుల్.. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 19న జాలీ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ 3

జాలీ వర్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాలీ.. డబుల్ ట్రబుల్.. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 19న జాలీ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ 3

అక్షయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అర్షద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్సీ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూపొందుతున్న హిందీ చిత్రం ‘‘జాలీ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ 3’. ఇప్పటికే ఈ కోర్టు రూమ్ డ్రామా ఫ్రాంచైజీలో రెండు సినిమాలు వచ్చి మెప్పించగా ఇది మూడో చిత్రం. ఫస్ట్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాలీగా అర్షద్ వార్సీ నటించగా,  రెండో సినిమాలో జాలీగా అక్షయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనిపించారు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి వస్తున్నారు. అడ్వకేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జగదీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్యాగి.. అలియాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాలీగా అర్షద్ వార్సీ కోర్టు రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంట్రీ ఇవ్వగా.. అదే కేసును వాదించే డిఫెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జగదీశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిశ్రా అలియాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాలీగా అక్షయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంట్రీ ఇచ్చాడు.

కోర్టులో వీళ్లిద్దరి మధ్య సాగే వాదోపవాదాల నేపథ్యంలో సాగే డబుల్ ట్రబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కామెడీతో కట్ చేసిన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవ్వులు పంచింది. జడ్జి పాత్రలో సౌరబ్ శుక్లా కనిపించారు. అక్షయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా హ్యూమా ఖురేషి, అర్షద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా అమృతా రావ్ నటించారు. మరో అడ్వకేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అన్ను కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలకపాత్ర పోషించారు.   గత రెండు చిత్రాల తరహాలోనే ఇది కూడా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ సాగే హిలేరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్ డ్రామా అని అర్థమవుతోంది. సుభాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కపూర్ దర్శకత్వం వహించగా  అలోక్ జైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అజిత్ అంధారే నిర్మించారు. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 19న ప్రేక్షకుల ముందుకురానుంది.