చర్చిలో అంత్యక్రియలు జరుగుతుండగా.. పిస్టల్, రైఫిల్ తో జనంపై కాల్పులు.. ఏడుగురు స్పాట్ లోనే చనిపోయారు

చర్చిలో అంత్యక్రియలు జరుగుతుండగా.. పిస్టల్, రైఫిల్ తో జనంపై కాల్పులు.. ఏడుగురు స్పాట్ లోనే చనిపోయారు

జోర్డాన్‌లోని చర్చిలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా మరో 34 మంది గాయపడ్డారు. శుక్రవారం (అక్టోబర్23)కరాక్ గవర్నరేట్‌లోని హమూద్ చర్చిలో అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. గాయపడిన వారిలో 27 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన వారి కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 

అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైన సమయంలో వాహనంలో వచ్చిన దుండగులు చర్చిపై కాల్పులు జరిగాయి. రైఫిల్, పిస్టల్‌తో వచ్చిన దుండగులు కొన్ని నిమిషాల పాటు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ దాడిని ఉగ్రవాదుల బృందం చేసినట్లు జోర్డాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి తెలిపారు. అయితే, దాడికి ఎవరు బాధ్యులన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఈ ఘటనపై జోర్డాన్ రాజు అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. దేశ ప్రజల ఐక్యతను దెబ్బతీయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. 

జోర్డాన్‌లో ఇలాంటి దాడులు చాలా అరుదు. తాజా ఘటనతో దేశంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.