
సంతోష్ శోభన్, ఫల్గుణి ఖన్నా జంటగా జి సుభాష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’. ఫస్ట్ కాపీతో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైందని నిర్మాత మురళీకృష్ణ వంకాయలపాటి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇదొక రొమాంటిక్ కామెడీ మూవీ. మ్యూజికల్ లవ్ స్టోరీగా రూపొందించాం. సంతోష్ శోభన్ కెరీర్‌లో స్పెషల్ సినిమాగా నిలుస్తుంది. నాగవంశీ సంగీతం ఆకట్టుకునేలా ఉంటుంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’ అని చెప్పారు.