
జూనియర్ ఎన్టీఆర్ తో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాల క్రితమే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఇక అప్పటినుండి ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నేటితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కాస్తా ఊరట కలిగిస్తూ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.
ఇవాళ ఆగస్ట్ 9న ఎన్టీఆర్-నీల్ కాంబోలో వస్తోన్న NTR 31 పూజా కార్యక్రమం రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోస్ షేర్ చేసి రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.
ఈ మేరకు మైత్రి మేకర్స్ ట్విట్టర్ X లో "మ్యాన్ ఆఫ్ ది మాసెస్..స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో భూమి కంపిస్తుంది! జనవరి 9, 2026న చూడటానికి సిద్ధంగా ఉండండి" అంటూ పోస్ట్ చేసారు.ఈ తాజా అప్డేట్తో తారక్, ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
This time, the earth will tremble under his reign! ?#NTRNeel will step onto the soil on January 9th, 2026 ❤️?
— Mythri Movie Makers (@MythriOfficial) August 9, 2024
MAN OF MASSES @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial pic.twitter.com/MfS0aS8OlV
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. మరి NTR 31 రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుండి షురూ కానుందో రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాకు 'డ్రాగన్' (Dragon) అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో ఫుల్ మాసివ్ రోల్లో తారక్ కు లుక్, క్యారెక్టరైజేషన్‌ను..దృష్టిలో పెట్టుకొనే ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని నీల్ డిసైడ్ అయినట్లు టాక్.
??? ???? ???? ???? ?? ????? ??????????? ?? ??? ??? ?????? ?? ?????!!
— Mythri Movie Makers (@MythriOfficial) May 20, 2022
??? ????.. ??? ?????..
??? ?????????? ??? ??? ?????..#NTR31 is going to be hugeeeee ?@tarak9999 @prashanth_neel pic.twitter.com/uF2WsiDnbP
తారక్ ప్రస్తుతం దేవర షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దేవర రెండు పార్టులుగా వస్తుండగా.. పార్టు 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ సలార్ 2 పనులతో బిజీగా ఉన్నాడు. మరోవైపు తారక్ వార్ 2 సినిమా కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాల షెడ్యూల్‌ను బట్టి ఎన్టీఆర్ 31 రెగ్యులర్ షూటింగ్‌పై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని సినీ సర్కిల్ నుండి సమాచారం.
The moment we all have been waiting for is here ?#NTRNeel begins with an auspicious Pooja Ceremony ? ?
— Mythri Movie Makers (@MythriOfficial) August 9, 2024
The DUO is all set to create a MONSTROUS HAVOC at the BOX OFFICE ❤️?
See you all on his land from ??????? ???, ???? ?
Man of Masses @tarak9999… pic.twitter.com/rzNzrsZIcG