Ntr War-2: వార్ 2 నుండి క్రేజీ న్యూస్.. బాలీవుడ్కు షాకిస్తున్న ఎన్టీఆర్ రెమ్యునరేషన్

Ntr War-2: వార్ 2 నుండి క్రేజీ న్యూస్.. బాలీవుడ్కు షాకిస్తున్న ఎన్టీఆర్ రెమ్యునరేషన్

ఆర్ఆర్ఆర్(RRR) మూవీ గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్(Ntr) క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. దీంతో ఆయన చేస్తున్న సినిమాలపై ఇంటర్నేషనల్ వైడ్ గా భారీ బజ్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో కొరటాల(Koratala)తో చేస్తున్న దేవర(Devara) కాగా.. రెండవది బాలీవుడ్ లో చేస్తున్న వార్2(War2). ఈ రెండు సినిమాల్లో వార్ 2 మూవీపై ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్నాయి. కారణం ఈ సినిమాలో బూలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్ హీరోగా నటిస్తుండటం. వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇండియన్ రా ఏజెంట్ గా ఎన్టీఆర్ కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ ఐనా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా వార్ 2 గురించి అలాంటి న్యూస్ ఒకటితో ఫిల్మ్ వర్గాల్లో చర్చనియ్యాంశం అయింది. అదేంటంటే.. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారట. కేవలం ప్రత్యేక పాత్ర కోసం ఏకంగా రూ.100 కోట్లు అందుకోనున్నాడట ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ స్టార్స్ అవాక్కవుతున్నరట. కారణం.. అక్కడ చాలా మంది స్టార్స్ ఉన్నప్పటికీ ఏ హీరో కూడా ఫుల్ సినిమాకి సైతం రూ.100 కోట్లు రెమ్యునరేషన్ గా అందుకోలేదు. షారుఖ్, సల్మాన్, ఆమిర్ వంటి స్టార్స్ మాత్రమే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు కేవలం స్పెషల్  రోల్ కోసం ఎన్టీఆర్ ఈ రేంజ్ లోల్ ఛార్జ్ చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై నెటిజన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. స్పెషల్ రోల్ కోసం వంద కోట్లా.. ఇదెక్కడి మాస్ క్రేజ్ రా మావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ చేయండి.