దేవర నుండి ఎన్టీఆర్ పిక్ లీక్.. షేక్ అవుతున్న సోషల్ మీడియా

దేవర నుండి ఎన్టీఆర్ పిక్ లీక్.. షేక్ అవుతున్న సోషల్ మీడియా

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Shiva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ ఐనా క్షణాల్లో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. ఇక తాజాగా మరోసారి దేవర మూవీ ట్రేండింగ్ లోకి వచ్చింది. 

కారణం.. దేవర మూవీ నుండి ఎన్టీఆర్ షూటింగ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో లీకైంది. ఈ లుక్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఈ పిక్ ఎన్టీఆర్ బ్లాక్ డ్రెస్ లో గుబురు గడ్డంతో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. పక్కనే దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారు. ఈ లుక్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దేవర సినిమాతో ఎన్టీఆర్ మాస్ లెవల్స్ ఏంటో అందరికీ అర్థమవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక దేవర సినిమా విషయానికి వస్తే.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ క్రియేషన్స్ బ్యానర్స్ పై హీరో కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీఖాన్ విల్లన్ గా నటిస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న ఈ సినిమా ఎలాంటి  విజయాన్ని అందుకుంటుందో చూడాలి.