Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఫ్యాన్స్ కీలక ప్రకటన

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఫ్యాన్స్ కీలక ప్రకటన

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ నెల 18న ఎన్టీఆర్ నుంచి సంచలన ప్రకటన ఉంటుందనీ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల హీరోలు పోలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో, తారక్ ఎంట్రీ కూడా వచ్చే (2029) ఎలక్షన్లో ఉంటుందని టాక్ ఊపందుకుంది. ఈ క్రమంలోనే మీడియా వర్గాలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోషియన్స్ క్లారిటీ ఇస్తూ కీలక ప్రకటన చేశాయి. 

ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తిగా తన సినిమా ప్రాజెక్టులపైనే దృష్టి సారించారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆయన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలను కేవలం ఊహాగానాలుగానే చూడాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంఘాలు వెల్లడించాయి. ఇప్పుడు ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎన్టీఆర్ లేదా ఆయన టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ ప్రకటనలో క్లారిటీ ఇస్తూ..‘‘జూలై 18న ఎన్టీఆర్ గారి రాజకీయ ప్రకటన ఉంటుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న పోస్టులను మా దృష్టికి వచ్చాయి. మా సమాచారం మేరకు, అవన్నీ పూర్తిగా వదంతులు మాత్రమే. ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. జూలై 18న నిర్వహించనున్న ఊరువాడా కార్యక్రమాన్ని చాలా ముందుగానే ప్రణాళికాబద్ధంగా రూపొందించాం. ఈ ఈవెంట్ ఉద్దేశం ఊరువాడ ప్రధాన ఆలోచన, లక్ష్యాన్ని ప్రజలకు పరిచయం చేయడం మాత్రమే. ప్రస్తుతం జరుగుతున్న తారక్ రాజకీయ ప్రచారాలతో ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదు.

మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా పేజీలు ధృవీకరణ లేని లేదా అసత్య సమాచారాన్ని ప్రచారం చేయకుండా, వార్తలను ప్రచురించే లేదా పంచుకునే ముందు వాస్తవాలను నిర్ధారించాలని మనవి. దీంతో అభిమానుల్లో అనవసర గందరగోళం నెలకొనకుండా ఉంటుంది. కార్యక్రమం జరిగే వేదిక, సమయం, పూర్తి వివరాలను త్వరలోనే మా అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా వెల్లడిస్తాం. మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోషియన్ క్లారిటీ ఇచ్చారు.

లూగర్’గా ఎన్టీఆర్..

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సంచలనాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న  ప్రతిష్టాత్మక చిత్రం ‘డ్రాగన్’ (Dragon). ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ గ్లింప్స్ రికార్డులు సృష్టిస్తూ అంచనాలను రెట్టింపు చేస్తోంది. దాదాపు 100 మిలియన్ డిజిటల్ వ్యూస్‌కు చేరువై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. 'డ్రాగన్' చిత్రంలో ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్ర పేరు 'లూగర్'. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇదొక అత్యంత ధైర్యమైన నిర్ణయమని ప్రశాంత్ నీల్ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు నీల్ కెరీర్‌లో తాను రాసిన అన్ని పాత్రల కంటే ‘లూగర్’ పాత్ర అత్యంత క్రూరంగా, ఇంటెన్స్‌గా ఉంటుంది అని ఇటీవలే వెల్లడించారు. ఈ భారీ యాక్షన్ మూవీ జూన్ 11, 2027 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.