NTR for LENIN: నాగ్ మాస్టర్ ప్లాన్.. అఖిల్ కోసం రంగంలోకి ఎన్టీఆర్?

NTR for LENIN: నాగ్ మాస్టర్ ప్లాన్.. అఖిల్ కోసం రంగంలోకి ఎన్టీఆర్?

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’(LENIN). రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జులై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా విడుదలకు ఇంకా ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇటీవలే ట్రైలర్‌కు సాలిడ్ రెస్పాన్స్ రావడంతో ప్రమోషన్స్‌ను మరింత భారీగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను కూడా ప్రమోషన్లలో భాగం చేయాలని నాగార్జున ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

లెనిన్ కోసం ఎన్టీఆర్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘లెనిన్’ ప్రమోషన్స్‌లో భాగమైనట్లు సమాచారం. అఖిల్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేయనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనౌన్స్ రాలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే, సినిమా ప్రమోషన్స్‌కు భారీ మైలేజ్ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక గతంలో అఖిల్ నటించిన ‘మిస్టర్ మజ్ను’ సినిమా ఫంక్షన్కు ఎన్టీఆర్ వచ్చి భారీ హైప్ తీసుకొచ్చారు. ఇప్పుడు ‘లెనిన్’ ప్రమోషన్లలో కూడా తారక్ పాల్గొంటారనే ప్రచారం అక్కినేని అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.

ALSO READ : ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్‌ డేట్ ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్..

ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై భారీ అంచనాలు..

‘లెనిన్’ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరగనుంది. రేపు ఆదివారం సాయంత్రం 5:00 గంటల నుండి తిరుపతిలోని నెహ్రు మున్సిపల్ గ్రౌండ్ వేడుకకు సర్వం సిద్దమవుతుంది. అయితే, ఈ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హాజరయ్యే అవకాశముందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

ఒకవేళ ఎన్టీఆర్ కనుక ‘లెనిన్’ స్టేజిపై మెరిస్తే.. అక్కినేని-నందమూరి ఫ్యాన్స్ తో వేదిక దద్దరిల్లుతుంది . దీంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. మరి ఎన్టీఆర్ వచ్చేది స్పెషల్ ఇంటర్వ్యూ జరపడానికా? లేక ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసమా? అన్నది తెలియాల్సి ఉంది.  

చరణ్‌కు రంగస్థలం- అఖిల్‌కు లెనిన్: 

టాలీవుడ్ టాప్ బ్యానర్స్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జునల నిర్మాణంలో ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. అఖిల్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనది కావడంతో, ప్రొడక్షన్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే నాగ్ పలుమార్లు సినిమాను వాయిదా వేస్తూ వచ్చాడు.

అంచనాలకు తగ్గట్టుగానే మురళి కిశోర్ అబ్బూరి రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాడు. ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో "చరణ్‌కు రంగస్థలం ఎంత ముఖ్యమైన సినిమో.. అఖిల్‌కు లెనిన్ కూడా అంతే కీలకమైన చిత్రం" అనే చర్చ జరుగుతోంది.

అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుని బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంటుందా లేదా అనేది విడుదల తర్వాతే తేలనుంది. ఇకపోతే, ఈ చిత్రంలో అఖిల్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటుడు శివాజీ, నటి శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.