NTR దేవరలో ఈ సాంగ్‌కు పూనకాలు పక్కా

NTR దేవరలో ఈ సాంగ్‌కు  పూనకాలు పక్కా

ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ వైపు ‘దేవర’.. మరోవైపు హిందీలో ‘వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’ చిత్రాల షూటింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బిజీగా ఉన్నాడు. వీటితో పాటు రీసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ  ఓ సినిమాను స్టార్ట్ చేశాడు. వీటిలో ‘దేవర’ మూవీ షూటింగ్ కొన్ని రోజుల్లో పూర్తవుతుంది. ఇటీవల క్లైమాక్స్ షూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంప్లీట్ చేశారు. లేటెస్ట్ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. ‘ఈ చిత్రంలోని ఓపెనింగ్ సాంగ్ షూట్ చేస్తున్నాం. విజువల్స్ అద్భుతంగా వస్తున్నాయి. అనిరుధ్ మ్యూజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రెడీ అవుతున్న ఈ పాటలో ఎన్టీఆర్ గ్రేస్, డ్యాన్స్ మూమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పూనకాలు పక్కా’ అని ఆయనతో సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు.  ఈ పాటకు గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నట్టు తెలియజేశాడు. 

అలాగే లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి కూడా ఈ పాట గురించి పోస్ట్ చేస్తూ  ‘ఆయుధ పూజ సాంగ్ షూట్ చూస్తూ ఎమోషనల్ అయ్యా’ అనడంతో ఈ పాట  కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని ప్రెస్ట్రిజీయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రూపొందిస్తున్నాడు. జాన్వీ కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. 

సైఫ్ అలీఖాన్ విలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నాడు. నందమూరి  కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  నిర్మిస్తున్నారు.  రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది.