తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్ టెన్షన్ : RAW NTR ప్రెస్ మీట్ పై పోలీస్ భారీ భద్రత

తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్ టెన్షన్ : RAW NTR ప్రెస్ మీట్ పై పోలీస్ భారీ భద్రత

తిరుపతి సిటీలో సినిమా టెన్షన్.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా చెప్పుకుంటూ.. సేవా కార్యక్రమాలు చేస్తున్న RAW ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ పెట్టి తీరతాం అని ప్రకటించింది. RAW ఎన్టీఆర్ ఊరువాడ పేరుతో.. 100 కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్, టీడీపీ వర్గాలతో.. RAW ఎన్టీఆర్ ఫ్యాన్స్ వివాదం నడుస్తుంది. RAW ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెస్ మీట్ నిర్వహించకుండా చూడాలంటూ జిల్లా పోలీసులకు, ఎస్పీకి..  ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లయింట్ చేయటంతో.. ప్రెస్ మీట్ జరిగే తాజ్ తిరుపతి హోటల్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. 

RAW ఎన్టీఆర్ ఫ్యాన్స్ 100 కోట్ల రూపాయలతో నిర్వహిస్తున్న ఊరు వాడ కార్యక్రమంతో తనకు ఎలాంటి సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే.. ఈ ప్రెస్ మీట్ ను అడ్డుకుంటామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్.. టీడీపీ వర్గాలు వార్నింగ్ ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే హోటల్ దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

RAW ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరు వాడ కార్యక్రమం.. మా వ్యక్తిగతం అని.. మా హీరోపై అభిమానంతో చేస్తున్నామని.. దీని వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని.. దీన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని RAW ఫ్యాన్స్ ప్రకటించింది. వీళ్ల వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందనే ప్రచారాన్ని ఇప్పటికే ఖండించారు ప్రతినిధులు. ప్రెస్ మీట్ జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ క్రమంలో.. తిరుపతిలో తాజ్ హోటల్ దగ్గర ప్రెస్ మీట్ ఏర్పాట్లు జరిగిపోయాయి. దీన్ని టీడీపీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడ్డుకునే అవకాశం ఉందని.. ఇదే జరిగితే గొడవ జరగొచ్చన్న ఉద్దేశంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.