NTR DRAGON: భుజం గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూటింగ్‌లోకి రీఎంట్రీ!

NTR DRAGON: భుజం గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూటింగ్‌లోకి రీఎంట్రీ!

ఎన్టీఆర్,  ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’.  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ను అందించారు నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని రామోజీ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌సిటీలో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.  

భుజం గాయం కారణంగా కొన్నాళ్లుగా రెస్ట్ తీసుకున్న  ఎన్టీఆర్  రీసెంట్‌‌‌‌‌‌‌‌గా  సెట్‌‌‌‌‌‌‌‌లో జాయిన్ అయ్యాడు.  ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో యాక్షన్ సీన్స్‌‌‌‌‌‌‌‌తోపాటు కొన్ని  కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 1967 నేపథ్యంతో సాగే ఈ కథలో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే పాత్రలో కనిపించనున్నట్టు ఇప్పటికే రివీల్ చేశారు. కథలో అంతర్జాతీయ మాఫియా, అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ వంటి అంశాలు కీలకంగా ఉండనున్నట్టు గ్లింప్స్ ద్వారా చూపించారు. 

రుక్మిణీ వసంత్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తుండగా.. అనిల్ కపూర్,  బిజు మీనన్, ఖుష్బు సుందర్, ఆశుతోష్ రాణా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  ర‌‌‌‌‌‌‌‌వి బ‌‌‌‌‌‌‌‌స్రూర్ సంగీతం అందిస్తున్నాడు. జూన్ 11న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.