మహమ్మద్ నజీర్, రిఫత్ రజూర్ జంటగా నటించిన మెలోడియస్ మ్యూజిక్ వీడియో ‘అప్నీ హద్ సే’. తాజాగా ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ ‘యువ ప్రతిభను ప్రోత్సహించడం సంతోషంగా ఉంది. సౌత్‌లో హిందీ సాంగ్‌ను లాంచ్ చేయటం చాలా మంచి పరిణామం. ఈ వీడియో సాంగ్ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ఈ మ్యూజిక్ వీడియోలో మహమ్మద్ నజీర్, రిఫత్ రజూర్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. హరి తాటిపల్లి డైరెక్షన్, కొరియోగ్రఫీ అందించిన ఈ పాటను బాలీవుడ్ సింగర్ అభయ్ జోధ్‌పుర్కర్ పాడటం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
