ఈ ఏడాది సౌత్ సినిమా బాక్సాఫీస్ ఊహించని రేంజ్‌లో దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బ్లాక్‌బస్టర్ బోణీ కొట్టగా.. ‘అనగనగా ఒక రాజు’, ‘నారి నారి నడుమ మురారి’ లాంటి చిత్రాలు కూడా కలెక్షన్ల వర్షం కురిపించాయి. కోలీవుడ్‌లో సూర్య ‘కరుప్పు’ సినిమాతో ఫస్ట్ క్లాస్ బ్లాక్‌బస్టర్ నిలిచింది. తమిళంలో .. చిన్న బడ్జెట్ చిత్రాలు ‘విత్ లవ్’, ‘థాయ్ కిళవి’, ‘యూత్’ వండర్స్ క్రియేట్ చేశాయి. ఇక మాలీవుడ్‌లో ‘వాళ 2’, ‘భరతనాట్యం 2’ టాప్ గేర్‌లో దూసుకెళ్లాయి.
లేటెస్ట్ గా రిలీజ్ అయిన దృశ్యం 3 రికార్డులు సృష్టిస్తోంది. వారం రోజుల్లోనే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అదే జోరుతో.. జూన్ నెలలో థియేటర్లలో రచ్చ లేపడానికి టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ నుండి సరికొత్త సినిమాలు లైన్ కట్టాయి. ఇప్పటికే ఈ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 2026లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ క్రేజీ సినిమాల లిస్ట్ చూద్దాం..
'పెద్ది' (Peddi)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా.. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) - . 1980ల నాటి ఆంధ్రప్రదేశ్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో, తన ఊరి పరువు కోసం ఓ యువకుడు స్పోర్ట్స్ ద్వారా ఎలా పోరాడాడనేదే కథ. ఇప్పటికే 3 గంటల 9 నిమిషాల సుదీర్ఘ రన్‌టైమ్‌తో సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. జూన్ 4 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి.
'పరిమళ అండ్ కో' (Parimala And Co)
తమిళ సీనియర్ నటులు జయరామ్, ఊర్వశి లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఫుల్-టు- ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ 'పరిమళ అండ్ కో ' (Parimala And Co) . దర్శకుడు పాండిరాజ్ ఒక ఫ్యామిలీ చుట్టూ తిరిగే మర్డర్ మిస్టరీని పక్కా సస్పెన్స్, ఫన్ ఎలిమెంట్స్‌తో ప్లాన్ చేశారు. యోగి బాబు కామెడీ ఈ సినిమాకు అదనపు బలం చేకూరనుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం జూన్ 5 రిలీజ్ కు సిద్ధమైంది.
ALSO READ : మహేష్ ‘రుద్ర’ పాత్రకు దైవిక శక్తి..
'మాలీవుడ్ టైమ్స్' (Mollywood Times)
'ప్రేమలు' ఫేమ్ నస్లేన్ కే గఫూర్ హీరోగా నటిస్తున్న మలయాళి క్లీన్ కామెడీ డ్రామా మాలీవుడ్ టైమ్స్ (Mollywood Times). మలయాళ ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్ కావాలని కలలు కనే ఓ ప్లస్-2 స్టూడెంట్ కథ ఇది. అభినవ్ సుందర్ నాయక్ దీనికి దర్శకుడు. ఈ సినిమా జూన్ 5న విడుదల కానుంది.
'మ్యాంగో పచ్చ' (Mango Pachcha)
కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ మేనల్లుడు సంచిత్ సంజీవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న క్రైమ్ యాక్షన్ డ్రామా 'మ్యాంగో పచ్చ' (Mango Pachcha) . 2001-2011 మధ్య మైసూర్‌లో జరిగే పొలిటికల్ అండర్‌వరల్డ్ కథాంశంతో ఈ సినిమా రాబోతోంది. - ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 5న థియేటర్లలోకి రానుంది.
'సింగ్ గీతం' (Sing Geetham)
94 ఏళ్ల వయసులో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు మ్యాజిక్ చేయబోతున్నారు. 'కల్కి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ (స్వప్న సినిమాస్) నిర్మిస్తున్న మ్యూజికల్ మైవీ 'ఫాంటసీ సింగ్ గీతం' (Sing Geetham). మూవీలో అహిల్య బమ్రూ, అయాన్ కే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ టాలీవుడ్ మూవీ జూన్ 11న రిలీజ్ అవుతుంది.
'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram)
సమంత రూత్ ప్రభు నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ మా ఇంటి బంగారం (Maa Inti Bangaram) . అయితే ఐపీఎల్ వల్ల పోస్ట్‌పోన్ అయి జూన్‌లో వస్తోంది. నందినీ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సమంత 'బ్లడీ బోల్డ్' హౌస్‌వైఫ్‌గా, గన్ పట్టి విలన్ల తాట తీసే పవర్‌ఫుల్ యాక్షన్ రోల్‌లో మెరవనుంది. సంతోష్ నారాయణన్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్. జూన్ 19న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
'బాలన్ ది బాయ్' (Balan The Boy)
మలయాళం చిత్రం 'మంజుమ్మెల్ బాయ్స్' డైరెక్టర్ చిదంబరం, 'ఆవేశం' రైటర్ జితు మాధవన్ కాంబోలో వస్తున్న ఎమోషనల్ డ్రామా 'బాలన్ ది బాయ్' (Balan The Boy) -. కాన్స్ (Cannes) ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు అందుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 15న భారీ అంచనాల మధ్య రిలీజ్ కానుంది
'లెనిన్' (Lenin) - తెలుగు
వరుస పరాజయాలతో ఉన్న అక్కినేని అఖిల్ ఈసారి ఘట్టిగా కొట్టాలని ఫిక్స్ అవుతున్నారు. 'ఏజెంట్' తర్వాత చేస్తున్న పక్కా విలేజ్ యాక్షన్ డ్రామా 'లెనిన్'. మురళి కిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ అంచనాపెట్టకున్న ఈ మూవీ జూన్ 26 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. మరి ఈ జూన్ రేసులో బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచే సినిమా ఏదో చూడాలి..
