జ్యోతిష్యం: జూన్ నెలలో గురుడు.. శుక్రుడు కలిసి సంచారం.. మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది..!

జ్యోతిష్యం:  జూన్ నెలలో  గురుడు.. శుక్రుడు కలిసి సంచారం.. మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది..!

జ్యోతిష్య శాస్త్ర పరంగా ఈ ఏడాది (2026) జూన్ నెల ఎంతో  కీలకమైన నెలగా భావిస్తున్నారు. ఈ నెలలో ఏకంగా ఆరు ప్రధాన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. ఈ గ్రహ సంచారాల ప్రభావం కొన్ని రాశుల వారికి ప్రత్యేక శుభఫలితాలను అందించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  ముఖ్యంగా 12 ఏళ్ల తరువాత జూన్​ 2 వతేదీన  గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.. అలాగే 8 వ తేదీన శుక్రుడు కూడా అదే రాశిలోకి ప్రవేశించనున్నాడు.  దీని ప్రభావం వలన ఈ నెల ( 2026 జూన్​) మేషరాశి వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 


జూన్​ నెల (2‌026)  గ్రహాల మార్పు వివరాలు 

జూన్​ 2:  గురుడు కర్కాటకరాశిలోకి
జూన్​ 8:  కర్కాటకరాశిలో శుక్రుడు.. గురుడు 
జూన్​ 13:  శుక్రుడు సింహరాశిలోకి
జూన్​ 15న:  సూర్యుడు మిథునరాశిలోకి
జూన్​ 21 :  కుజుడు వృషభ రాశిలోకి
జూన్​ 22:  కర్కాటకరాశిలోకి  బుధుడు
జూన్​ 29 :  కర్కాటక రాశిలో వక్రగతిలో బుధుడు

గురువు, శుక్రుడు, సూర్యుడు  గ్రహాలతో పాటు రాశ్యధిపతి కుజుడు కూడా బాగా అనుకూల సంచారం వలన మేషరాశి వారికి  ఈ నెలంతా  ( 2026 జూన్​) చీకూ చింతా లేకుండా గడిచిపోతుంది. ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. సర్వత్రా మీ మాట చెల్లుబాటవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. 

 ఈ కాలం అభివృద్ధి పథంలో సాగిపోవడానికి చక్కని అవకాశమని పండితులు చెబుతున్నారు. జీవితంలో కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగుతారు. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఆచితూచి అడుగు వేయడం వల్ల ఈ అదృష్ట సమయాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మీరు చేసే కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది

సుఖాలు, సౌకర్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాల కోసం ప్రయత్నాలు సాగిస్తారు. పిల్లల బాగోగుల విషయంలో శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. 

కెరీర్ లో ఆశించిన పురోగతి ఉంటుంది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. విదేశీ సంబంధమైన వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. ప్రేమ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుందని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.