జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 జూన్ నెల అత్యంత కీలకమైన మార్పులకు వేదిక కాబోతోంది. ఈ నెలలో ప్రధాన గ్రహాలన్నీ తమ రాశులను మారుస్తూ సరికొత్త సమీకరణాలకు తెరలేపుతున్నాయి. . ఇంకా కొన్ని కీలక గ్రహాలు కూడా వాటి స్థానాలు మారనున్నాయి. వీటి ప్రభావం వలన ధనస్సురాశి వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
జూన్ నెల (2026) గ్రహాల మార్పు వివరాలు ..
- జూన్ 2: గురుడు కర్కాటకరాశిలోకి
- జూన్ 8: కర్కాటకరాశిలో శుక్రుడు.. గురుడు
- జూన్ 13: శుక్రుడు సింహరాశిలోకి
- జూన్ 15న: సూర్యుడు మిథునరాశిలోకి
- జూన్ 21 : కుజుడు వృషభ రాశిలోకి
- జూన్ 22: కర్కాటకరాశిలోకి బుధుడు
- జూన్ 29 : కర్కాటక రాశిలో వక్రగతిలో బుధుడు
రవి, కుజ, బుధ, రాహువుల అనుకూలత వల్ల నెలంతా చాలావరకు శుభప్రదంగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అష్టమ స్థానంలో రాశ్యధిపతి గురువు ఉచ్ఛ పట్టడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది కానీ, ఆర్థిక విషయాల్లో ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్టుగా ఉంటుంది. కొన్ని కష్టనష్టాల నుంచి బయటపడతారు. అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆర్థికపరంగా కూడా ప్రతి ప్రయత్నం సానుకూల ఫలితానిస్తుంది.
ఈ రాశి వారు శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు పెరగడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. బంధువులతోనూ.. స్నేహితులతోనూ చిన్న చిన్న విషయాలకూ మనస్పర్దలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు మీ పని మీరు చేసుకోండి.. వ్యాపారస్తులు ఏ మాత్రం కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దు. ఆధ్యాత్మిక చింతనతో గడపండి.. అంతా మంచే జరుగుతుంది.
కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరగడానికి, అదృష్ట సంఘటనలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయ వృద్ధి ఉంటుంది. అయితే, శని, శుక్రుల కారణంగా అనవసర ఖర్చులు పెరగడం, తరచూ విమర్శలకు గురి కావడం జరిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
