జూన్ నెలలో ఆరు గ్రహాలు రాశులు మారుతున్నాయి. గ్రహాల మార్పుల వల్ల సింహరాశి వారికి ఆదాయంలో పెరుగుదల, ఉద్యోగంలో మార్పు, కార్యసిద్ధి, విదేశీ యానం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి మొదలగు అంశాలు ఎలా ఉండబోతున్నాయి. వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది.. మొదలగు వవిషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.. !
జూన్ నెల (2026) గ్రహాల మార్పు వివరాలు ..
జూన్ 2: గురుడు కర్కాటకరాశిలోకి
జూన్ 8: కర్కాటకరాశిలో శుక్రుడు.. గురుడు
జూన్ 13: శుక్రుడు సింహరాశిలోకి
జూన్ 15న: సూర్యుడు మిథునరాశిలోకి
జూన్ 21 : కుజుడు వృషభ రాశిలోకి
జూన్ 22: కర్కాటకరాశిలోకి బుధుడు
జూన్ 29 : కర్కాటక రాశిలో వక్రగతిలో బుధుడు
రాశ్యధిపతి రవితో పాటు కుజ, బుధులు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని జ్యోతిష్యశాస్త్రం ద్వారా తెలుస్తుంది. శత్రువులు కూడా మిత్రు లుగా మారి సహాయపడతారు. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొద్దిగా ఆలస్యం గానే అయినా ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది.
ప్రతి విషయంలోనూ అంతా అనుకూలంగానే జరుగుతుంది. రొమాంటిక్ లైఫ్ మరింత ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతారు. . కార్యాలయంలో విజయం సాధిస్తారు. మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా వాటిని అమలు చేయండి. మీరు విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంది. ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి.
అష్టమ శని ప్రభావం వల్ల తరచూ అనారోగ్యానికి గురి కావడం, అనుకోని ఖర్చులు పెరగడం వంటివి జరుగుతాయి. ఎటు వంటి సమస్య అయినా కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది.
వృత్తి, ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉన్నా అందుకు తగ్గట్టుగా ప్రతిఫలం అందుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ముందుకు దూసుకుపోతారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
