హిందువులు వ్రతాలకు.. పూజలకు.. పండుగలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.. ఈఏడాది (2026) పరాభవనామ సంవత్సరం లో జూన్ నెల అధిక జ్యేష్ఠమాసంలో ప్రారంభమవుతుంది. ఈ నెల మధ్యలో నిజజ్యేష్టమాసం కూడా వస్తుంది. ఆధ్యాత్మికంగా అధికమాసం ఉన్నందున చాలా విశిష్టత ఉందని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్(2026) లో వచ్చే పండుగలు.. విశేషమైన రోజులు ఎప్పుడొచ్చాయో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఆధ్యాత్మికత, పూజల పరంగా జూన్ 2026 నెల ఎంతో విశిష్టమైనదిగా నిలవనుంది. ఈ ఏడాది జూన్ నెల ప్రారంభమే అధిక మాసం (పురుషోత్తమ మాసం) తో అవుతుండటం విశేషం. సనాతన ధర్మంలో ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ పుణ్యకాలంలో చేసే జప తపాలు, పూజలు, వ్రతాలు అనంతమైన పుణ్యఫలాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు.
జూన్ నెల అధిక జ్యేష్ఠమాసంలో ప్రారంభమైంది. అధికమాసం అంటే శ్రీమహావిష్ణువుకు చాలా ఇష్టమని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. పంచాంగం ప్రకారం అధిక మాసాన్ని పురుషోత్తమమాసం అంటారు. ఇది జూన్ 15 వ తేది వరకు ఉంటుంది. ఈ సమయంలో భక్తులు నిత్యం మహావిష్ణువుతో పాటు లయకారుడైన పరమశివుడిని, విఘ్నేశ్వరుడిని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. జూన్ 16 నుంచి నిజ్యేష్ఠమాసం ప్రారంభమవుతుంది.
జూన్ 2026 లో ముఖ్యమైన పండుగలు, విశేషాల జాబితా
- జూన్ 4: సంకష్ట చతుర్థి
- జూన్ 6 : సుబ్రహ్మణ్య షష్ఠి
- జూన్ 7 : భాను సప్తమి ( సూర్యనమస్కారాలకు ప్రత్యేకం)
- జూన్ 8: అధిక కాలాష్టమి, మాస కృష్ణ జన్మాష్టమి, మృగశిర కార్తె ప్రారంభం
- జూన్ 11: మతత్రయ ఏకాదశి
- జూన్ 12: శుక్ర ప్రదోష వ్రతం
- జూన్ 13: మాస శివరాత్రి
- జూన్ 15: అధిక దర్శ అమావాస్య (సోమవారపు అమావాస్య), మిథున సంక్రాంతి, అధిక మాసం సమాప్తం
- జూన్ 16: నిజ జ్యేష్ఠమాసం ప్రారంభం
- జూన్ 19: స్కంద షష్ఠి
- జూన్ 20: భాను సప్తమి
- జూన్ 22: ధూమావతి జయంతి, మాస దుర్గాష్టమి
- జూన్ 25: నిర్జల ఏకాదశి, గాయత్రీ మాత జయంతి
- జూన్ 26: మొహరం పండుగ
- జూన్ 27: శని ప్రదోష వ్రతం
- జూన్ 29: పౌర్ణమి .. ఏరువాక పౌర్ణమి
- జూన్ 29: వట పూర్ణిమ వ్రతం, జ్యేష్ఠ పూర్ణిమ
జూన్ నెలలో చేయాల్సిన పనులు, పరిహారాలు
- ఈ పవిత్ర మాసంలో ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.
- విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. అధిక మాసంలో అన్నదానం, వస్త్రదానం వంటి వాటికి విశేష ప్రాధాన్యత ఇవ్వాలి.
- ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ, మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలకు తావివ్వకుండా భగవన్నామ స్మరణలో గడపడం వల్ల జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులు వస్తాయని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
