Devara: దేవర మూవీ కథ చెప్పేసిన జూనియర్ ఆర్టిస్ట్.. అలా అయితే థియేటర్స్లో పూనకాలు కన్ఫర్మ్

Devara: దేవర మూవీ కథ చెప్పేసిన జూనియర్ ఆర్టిస్ట్.. అలా అయితే థియేటర్స్లో పూనకాలు కన్ఫర్మ్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) హీరోగా వస్తన్న లేటెస్ట్ మూవీ దేవర(Devara). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను నందమూరి ఆర్ట్స్, యువసుధా క్రియేషన్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ అక్టోబర్ 10న విడుదల కానుంది. 

ఇక ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. లుక్ పరంగా ఎన్టీఆర్ అదిరిపోగా కథ ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సినిమా ఎక్కువగా భయం అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది అని దర్శకుడు కొరటాల ఇప్పటికే చెప్పేసినా.. ఈ సినిమా గురించి ఇంకా తెలుసుకోవాలని ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. 

ఈ నేపధ్యంలోనే తాజాగా దేవర గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. దేవర సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా చేసిన వ్యక్తి దేవర కథ గురించి చెప్పిన వీడియో ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో వ్యక్తి చెప్పిన ప్రకారం.. దేవర సినిమాలో ఎన్టీఆర్ 10 ఊళ్ళకి కాపరిగా కనిపిస్తాడట. వాళ్లకి ఏదైనా ప్రమాదం వస్తే అడ్డంగా నిలబడే శక్తివంతమైన పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడట. దీంతో దేవర సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. కథ ఇదే అయితే.. సినిమాలో ఎన్టీఆర్ ఎలివేషన్స్ పీక్స్ లో ఉండటం ఖాయం. ఈ న్యూస్ తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. దేవర సినిమాకు థియేటర్స్ లో ఆడియన్స్ కి పూనకాలు రావడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.