జ్యోతిష్యం: పుష్యమి నక్షత్రంలోకి గురుడు... ఐదు రాశుల వారికి స్వర్ణయుగం..అదృష్ట రంగు.. చేయాల్సిన పరిహాలు ఇవే..!

జ్యోతిష్యం: పుష్యమి నక్షత్రంలోకి గురుడు... ఐదు రాశుల వారికి స్వర్ణయుగం..అదృష్ట రంగు.. చేయాల్సిన పరిహాలు ఇవే..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 జూలై 19వ తేదీ ఆదివారం రాత్రి 09:43 గంటలకు దేవ గురువు..  గురుడు పుష్యమి నక్షత్రం రెండవ పాదంలోకి ప్రవేశించనున్నారు. దీనిని చాలా పవిత్రమైన మరియు అరుదైన ఖగోళ మార్పుగా జ్యోతిష్యులు చెబుతున్నారు.  ఈ సంచారం కొన్ని రాశులవారికి విశేష ఫలితాలను అందిస్తోంది. ముఖ్యంగా 5 రాశులవారికి అపారమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. .  .!

మేషరాశి:  గురువు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించడం వలర ఈ రాశి వారి జీవితం ఆనందమయంగా మారుతుంది.  గురు గ్రహ ప్రభావంతో ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేరుతాయి. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగం మారాలి అని చూస్తున్నవారికి ఇది సరైన సమయని పండితులు చెబుతున్నారు. నిరుద్యోగులకు  కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. గతంలో నిలిచిపోయిన వ్యాపార ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయి. 

  • అదృష్ట రంగు: పసుపు. 
  • ప్రత్యేక పరిహారం: గురువారాల్లో విష్ణుమూర్తికి పసుపు పువ్వులను సమర్పించి, అరటి చెట్టును పూజించండి.

వృశ్చిక రాశి: గురుడు నక్షత్ర మార్పు వలన ఈ రాశి వారికి ఆకస్మికంగా ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.  కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు.  నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి - .ఆత్మవిశ్వాసం, అదృష్టం  పెరుగుతాయి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు,  ప్రభుత్వ పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. వ్యాపారం లేదా విద్య కోసం చేసే ప్రయాణాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. 

  •  అదృష్ట రంగు: బంగారు లేదా కుంకుమపువ్వు. 
  • ప్రత్యేక పరిహారం: మీ నుదుటిపై కుంకుమపువ్వు తిలకం పెట్టుకుని, మీ ఉపాధ్యాయులు లేదా పెద్దల ఆశీర్వాదం పొందండి.


మకర రాశి.. గురుడు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారి వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది.  ఖరీదైన వస్తువులలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  వృత్తి..ఉద్యోగం చాలా అనుకూలంగా ఉంటాయి. ప్రతిభకు, ఆలోచనలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది.  వృత్తి.. ఉద్యోగం.. వ్యాపారంలో  పురోగతి ఉంటుంది.  ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.   కొత్త ఆదాయ మార్గాలు అనుకోకుండా ఏర్పడటంతో సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.  వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు.  కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది

  •  అదృష్ట రంగు: లేత ఆకుపచ్చ. 
  • ప్రత్యేక పరిహారం: ప్రతి గురువారం ఆవుకు  బెల్లం మేత వేయండి

తులా రాశి:  గురుడు .. పుష్యమి నక్షత్రంలో సచారం వలన ఈ రాశి వారికి ఒత్తిడి తగ్గుతుంది. కాస్త కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది.  కొత్త వస్తువులు కొనుగోలుకు అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పనుల్లో పురోగతి ఉంటుంది.  మీరు తీసుకొనే నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది.   ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంది.  ఆఫీసులో మీరే కీలకం కావడంతో  ఎక్కువ సమయం పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. కెరీర్​ విషయంలో కొంత ఆందోళన చెందుతారు.  వ్యాపారస్తులకు అనుకోని లాభాలు కలుగుతాయి.  ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది.

  • అదృష్ట రంగు: తెలుపు లేదా క్రీమ్.
  •  ప్రత్యేక పరిహారం: గురువారం నాడు పేదవారికి శనగపప్పు , పసుపు రంగు దుస్తులను దానం చేయండి.


కుంభరాశి: మీ ప్రత్యర్థులను అధిగమించి, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. పాత అప్పుల నుంచి విముక్తి కల్పిస్తుంది.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  ఉద్యోగస్తులకు ... వ్యాపారస్తులకు మంచి సమయం. కేరీర్​ పరంగా మంచి నిర్ణయం తీసుకుంటారు.  ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్​ పొందే అవకాశం ఉంటుంది. అనవసరంగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి.  బిజినెస్​ చేసే వారు పెట్టే కొత్త పెట్టుబడులకు ఊహించని లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా బలపడతారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

అదృష్ట రంగు: లేత నీలం.
 ప్రత్యేక పరిహారం: గురువారాల్లో "ఓం బ్రిం బృహస్పతే నమః" మంత్రాన్ని జపించండి

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.