దేవతలకు గురువైన గురుడు సంపదను, శ్రేయస్సును, వివాహాన్ని, సంతానాన్ని, ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు. జీవితాన్ని సరైన దారిలో నడిపించి మంచి స్థాయికి చేరుకునేలా చూసుకుంటాడు. 12 ఏళ్ల తరువాత గురుడు జూన్ 2వ తేదీన కర్కాటకరాశి లోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 31వ తేదీ వరకు ఇదే రాశిలో ఉంటారు. . ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటున్నప్పటికీ ఆరు రాశుల (మేష, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మీన ) వారికి బాగా కలిసివస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. . చంద్రుడికి సొంత రాశి అయిన కర్కాటకంలోకి గురుడు రావడం వల్ల గజకేసరి యోగం వంటి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది.
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 2వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 2 . 25 గంటలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన గురుడు .. అక్టోబర్ 31వ తేదీ వరకు ఇదే రాశిలో ఉంటారు. దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది.
మేష రాశి: గురుడు కర్కాటక రాశిలో సంచరించే సమయంలో ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పడిన ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం కలిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయమార్గాలు ఏర్పడుతాయి. గురుడితో పాటు ఈ రాశి వారికి చంద్రుడి అనుగ్రహం కలగడంతో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృషభరాశి :ఈ రాశి వారికి అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. పెండింగ్ పనులు చాలా నిదానంగా పూర్తవుతాయి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా సమయానికి డబ్బు చేతికి అందుతుంది. . వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. . ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
మిథునరాశి : ఈ రాశి వారికి ... గురు కర్కాటక రాశి లో సంచారం వలన కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కష్టపడతారు కాని శ్రమకు తగిన ఫలితం ఉండకపోవచ్చు. సహోద్యోగులు.. తోటి వారి పట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. గతంలో మీనుంచి సాయం పొందిన వారు.. ఇప్పుడు ముఖం చాటేస్తారు. ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడాల్సి పరిస్థితులు నెలకొంటాయి. ఖర్చులు అధికమవుతాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కర్కాటకరాశి : గురుడు ఇదే రాశిలోకి జూన్ 2 న ప్రవేశించనున్నాడు. 12 ఏళ్ల తరువాత ఈ రాశి వారికి రాజయోగం పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులు కెరీర్ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కూడిన ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఊహించని లాభాలుంటాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. కొత్త ఆస్తులు కొనే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
సింహ రాశి : గురుడు.. కర్కాటక రాశిలో సంచారం ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులు పెద్ద డీల్ ను ఒప్పందం చేసుకునే అవకాశాలున్నారు. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. జాబ్ మారాలనుకునే వారికి ఇదిశుభ సమయమని పండితులు చెబుతున్నారు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి.
కన్య రాశి : కర్కాటక రాశిలో గురుడు సంచారం వలన ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తి సమస్యలు.. కొన్ని వివాదాలు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఈ రాశి వారికి క్షణం తీరిక లేదు.. పైసా ఆదాయం లేదు అన్న విధంగా ఉంటుంది. ప్రతి పనిలో జరిగే ఆలస్యం నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. దైవ చింతన చేస్తూ అనుకున్న పనులను మీ షెడ్యూల్ ప్రకారం చేయండి. ఉద్యోగస్తులకు స్థాన చలనం కలిగే అవకాశం ఉంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేయండి.
తులా రాశి : కర్కాటకరాశిలోకి గురుడు ప్రవేశించినతరువాత ఈ రాశి వారి జీవితంలో సానుకూలంగా చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగిప్రారంభమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి.
వృశ్చిక రాశి : కర్కాటకరాశిలోకి గురుడు ప్రవేశించడంతో ఈ రాశి వారికి చాలా ప్రశాంతత కలుగుతుంది. వ్యాపారస్తులకు అసహనం.. చిరాకు తొలగిపోతాయి. అనుకోకుండా ఒక్కసారిగా లాభాల బాట పడతారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. సానుకూల ఆలోచనలతో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థికంగా నిలకడ సాధిస్తారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి.
ధనుస్సురాశి : కర్కాటకంలో గురుడు సంచారం వలన ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. కొన్నిరంగాల్లో పని చేసే ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. మీడియా, మార్కెటింగ్, క్రియేటివ్ పనులు చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రియల్ఎస్టేట్ రంగంలో ఉన్న వారు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అనుకోకుండా అప్పులు చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు లాభం రాకపోయినా నష్టం ఉండదు. ప్రతి పని కూడా అతి కష్టం మీద పూర్తవుతుంది. ఏమాత్రం నిరుత్సాహ పడకుండా ముందుకుసాగండి.. చివరిలో అంతా మంచే జరుగుతుంది.
మకరరాశి : ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు పెరగడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. బంధువులతోనూ.. స్నేహితులతోనూ చిన్న చిన్న విషయాలకూ మనస్పర్దలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు మీ పని మీరు చేసుకోండి.. వ్యాపారస్తులు ఏ మాత్రం కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దు. ఆధ్యాత్మిక చింతనతో గడపండి.. అంతా మంచే జరుగుతుంది.
కుంభరాశి: గురుడు స్థాన చలనం కారణంగా ఈ రాశి వారి కెరీర్ లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సమాజంలో గౌరవం.. కీర్తి .. ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పని విషయంలో శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అయితే ఒక్కోసారి ఆందోళనకర వాతావరణం ఉంటుంది. అధైర్య పడకుండా మీరు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయండి.. అంతా మంచే జరుగుతుంది. వ్యాపారస్తులకు అంచనాకు మించి లాభాలొస్తాయి. పెళ్లి కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు
మీనరాశి: గురుడు .. కర్కాటకరాశిలో సంచారం వలన ఈ వారికి సమాజంలో మంచి గుర్తింపు కలుగుతుంది.గతంలో మిమ్ములను వ్యతిరేకించిన వారు మీ సహాయం కోరతారు. వ్యాపారస్తులకు పాత పెట్టుబడులకు ఈ సమయంలో ఊహించని లాభాలు పొందుతారు. ఆర్థిక సమస్యలు తగ్గడంతో చాలా ప్రశాంతంగా ఉంటారు. కెరీర్ విషయంలో ఊహించని మార్పులు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
