జూరాలకు మళ్లీ వరద.. ఆరు గేట్లు ఓపెన్.. శ్రీశైలం ప్రాజెక్ట్కు నీరు విడుదల

జూరాలకు మళ్లీ వరద.. ఆరు గేట్లు ఓపెన్.. శ్రీశైలం ప్రాజెక్ట్కు నీరు విడుదల

గద్వాల, వెలుగు: కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్ట్ కు మళ్లీ వరద రాక మొదలైంది. నారాయణపూర్ డ్యాం ఆరు గేట్లను ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి జూరాల ప్రాజెక్టుకు 65 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో జూరాల ప్రాజెక్ట్ ఆరు గేట్లను ఓపెన్ చేసి 24,864 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. జూరాల వద్ద ప్రస్తుతం 5,527 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాల నుంచి విద్యుత్ ఉత్పత్తికి 40,978 క్యూసెక్కులు వదులుతున్నారు.