Killer Movie: సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా ‘కిల్లర్’.. దసరాకు బ్యూటీ జ్యోతి ట్రైలర్ ట్రీట్

Killer Movie: సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా ‘కిల్లర్’.. దసరాకు బ్యూటీ జ్యోతి ట్రైలర్ ట్రీట్

జ్యోతి పూర్వజ్ లీడ్‌‌ రోల్‌‌లో నటిస్తున్న చిత్రం ‘కిల్లర్‌‌‌‌’ (KILLER). ‘శుక్ర’ ఫేమ్ పూర్వజ్‌‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదొక సైన్స్‌‌ ఫిక్షన్‌‌ యాక్షన్‌‌ థ్రిల్లర్‌‌‌‌.  ఏయు అండ్ ఐ,  మెర్జ్‌‌ ఎక్స్ఆర్‌‌‌‌ బ్యానర్లపై  పూర్వజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు.

ఈ మూవీ ట్రైలర్‌‌ను దసరా సందర్భంగా ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ అప్‌‌డేట్ అందిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌లో జ్యోతి పూర్వజ్ కనిపిస్తున్న తీరు టీజర్‌‌‌‌పై క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.  మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి  కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక ఈ సినిమా ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా  థియేటర్లలోకి రానుంది.  మరోవైపు, ఓవర్సీస్‌‌లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.  ఓఎంజీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్, రష్యాలో  పంపిణీ చేయనుంది.