రెండో భర్త హగ్గులు, కిస్సులు.. జగతి మేడం ఇన్స్టా పోస్ట్ వైరల్

రెండో భర్త హగ్గులు, కిస్సులు.. జగతి మేడం ఇన్స్టా పోస్ట్ వైరల్

జ్యోతిరాయ్(Jyothi Rai).. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న పేరు. గుప్పెడంత మనసు సీరియల్ తో ఫేమస్ ఆయిన ఈ అమ్మడు.. హోమ్లీ లుక్ లో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసుకుంది. అయితే అది కేవలం సీరియల్ వరకే అంటూ తన అసలైన గ్లామ్ లుక్ ను చూపించి ఆడియన్స్ కు షాకిచ్చింది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్ళకు నిద్రలేకుండా చేస్తోంది. దీంతో ఆమె కొంత కాలంగా ట్రెండ్ అవుతూనే ఉంది. 

ఇదిలా ఉంటే.. జ్యోతిరాయ్ రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కన్నడ దర్శకుడు సుకు పూర్వాజ్(Suku Purvaj) తో ప్రస్తతం ఆమె డేటింగ్ లో ఉందని, త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. అంతేకాదు జ్యోతిరాయ్ తన పేరు ముందు తన బాయ్ ఫ్రెండ్ పేరు పూర్వాజ్ అని యాడ్ చేసుకోవడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై అటు జ్యోతిరాయ్ గానీ, ఇటు సుకు పూర్వాజ్ ఎక్కడ స్పందించలేదు. 

అయితే తాజాగా.. జ్యోతిరాయ్ పెట్టిన ఇన్స్టాతో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. రీసెంట్ తన బాయ్ ఫ్రెండ్ సుకు పూర్వాజ్ పుట్టిన రోజు సందర్బంగా అతని గురించి, వారి బంధం గురించి వివరిస్తూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది.. మనం కలిసి అప్పుడే ఏడాది గడిచింది. నీ పరిచయం తరువాత నా జీవితమంతా మారిపోయింది. ప్రస్తుతం నా ఫీలింగ్స్ ను చెప్పడానికి మాటలు సరిపోవు. నీ లవ్, హగ్స్, సపోర్ట్, పాజిటివ్ థాట్స్, కేరింగ్ కి చాలా థ్యాంక్స్. నువ్వు నా భర్తగా నా జీవితంలోకి రావడం అనేది నా అదృష్టం. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్ డే తో మై డార్లింగ్. లవ్ యూ.. అంటూ రాసుకొచ్చింది జ్యోతిరాయ్. దీంతో ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలపై క్లారిటీ వచ్చేసింది.