కృష్ణ గారి క్వాలిటీస్ జయకృష్ణలో ఉన్నాయి: కె రాఘవేంద్రరావు

కృష్ణ గారి క్వాలిటీస్ జయకృష్ణలో ఉన్నాయి: కె రాఘవేంద్రరావు

మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని, రవీనా టాండన్ కూతురు రాషా తడాని జంటగా ‘ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌ 100’ ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అశ్వినీ దత్ సమర్పణలో  పి. కిరణ్ నిర్మిస్తున్నారు. జులై 9న సినిమా విడుదల కానుంది. తాజాగా   కృష్ణ జయంతి సందర్భంగా ఈ చిత్రం నుంచి శ్రీను, మంగా పాత్రలను పరిచయం చేశారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు అతిథిగా హాజరైన దర్శకుడు కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ  ‘వైజయంతీ మూవీస్ సంస్థలో కృష్ణ గారు సినిమాలు చేశారు. మహేష్​ బాబు ‘రాజకుమారుడు’ మూవీతో పరిచయం అయ్యారు. 

ఇప్పుడు జయకృష్ణ ఈ సంస్థ ద్వారా ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నా’ అని అన్నారు. జయకృష్ణ మాట్లాడుతూ ‘హీరో అవ్వాలనే ఆలోచనకు ప్రేరణ మా బంగారు తాతయ్య.  ఆయన లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. తాతయ్య కృష్ణ గారు నాకు దేవుడితో సమానం. నేను మహేష్ బాబాయ్‌‌‌‌‌‌‌‌కు డైహార్డ్ ఫ్యాన్‌‌‌‌‌‌‌‌ని. ఈ సినిమా విషయంలో ఆయన ఎప్పటికప్పుడు నాకు సలహాలు, ప్రోత్సాహం అందిస్తున్నారు” అని చెప్పాడు. ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం హ్యాపీ అని రాషా తడాని చెప్పింది.  డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ ‘కృష్ణ గారి క్వాలిటీస్ జయకృష్ణలో ఉన్నాయి. కచ్చితంగా అతను  చాలా పెద్ద హీరో అవుతాడు’ అని అన్నాడు. ఘట్టమనేని కుటుంబంలో మూడో తరాన్ని పరిచయం చేయడం ఆనందంగా ఉందని అశ్వినీదత్ అన్నారు. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత ఆది శేషగిరిరావు, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఈ కార్యక్రమంలో పాల్గొని కృష్ణగారితో వారికున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరారు.