కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా

కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కరోనా సోకింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఇడుపుల పాయలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వైఎస్ కుటుంబ సన్నిహితులు, మీడియా ప్రతినిధులకు వైద్యులు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. దీంతో వెంటనే వైఎస్ అవినాష్ రెడ్డి హోం ఐసోలేషన్ ‌కు వెళ్లారు. తన వెంట గత వారంరోజుల నుంచి తిరుగుతున్న వారిని కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు ఎంపీ అవినాష్ రెడ్డి.