యాక్షన్ మోడ్లో కాజల్.. ఆసక్తిరేపుతున్న సత్యభామ టీజర్

యాక్షన్ మోడ్లో కాజల్.. ఆసక్తిరేపుతున్న సత్యభామ టీజర్

సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్(kajal agarwal) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ(Satyabhama). దర్శకుడు సుమన్ చిక్కాల(Suman Chikkala) తెరకెక్కిస్తున్నఈ క్రైమ్ ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్లర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కాజల్  పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

టీజర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో అలరించిన కాజల్ ఫస్ట్ టైమ్ పోలీసుపాత్రలో ఆడియన్స్ ను అలరించనున్నారు. అంతేకాదు.. యాక్షన్ సీక్వెన్స్ లో కూడా అదరగొట్టేశారు. సస్పెన్స్, ఇన్వెస్టిగేటీవ్  నేపథ్యంలో వచ్చే సీన్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తంగా ఈ టీజర్ సత్యభామ సినిమాపై అంచనాలు పెంచేసింది. మేజర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శశికిరణ్ తిక్క ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తూ.. స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు. ఇక ఈ టీజర్ కు శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాగ్రౌంగ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవల్లో ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి.