సెకెండ్ ఇన్సింగ్స్‌‌‌‌లో దూసు కెళ్తోన్న కాజల్

సెకెండ్ ఇన్సింగ్స్‌‌‌‌లో   దూసు కెళ్తోన్న కాజల్

సెకెండ్ ఇన్సింగ్స్‌‌‌‌లోనూ వరుస సినిమాలతో దూసు కెళ్తోంది కాజల్ అగర్వాల్. ఓవైపు స్టార్ హీరోలకు జంటగా నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. ఆమె లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో ‘సత్యభామ’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. అఖిల్ డేగల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘మేజర్’ డైరెక్టర్ శశికిరణ్ తిక్క సమర్పణలో ఆయన సోదరుడు బాబీ తిక్క, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘లైట్స్, కెమెరా, యాక్షన్‌‌‌‌’ అంటూ ఈ మూవీ సెట్స్‌‌‌‌ నుంచి కొన్ని ఫోటోస్‌‌‌‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఈ మూవీ షూటింగ్‌‌‌‌తో బిజీగా ఉన్నట్టుగా చెప్పింది కాజల్ అగర్వాల్. ఇందులో ఆమె ఏసీపీ సత్యభామ గా పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ పాత్రలో కనిపించ నుంది. తన బర్త్‌‌‌‌ డే సందర్భంగా విడుదల చేసిన వీడియో గ్లింప్స్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు బాలకృష్ణకు జంటగా ఆమె నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం ఈనెల 19న విడుదల కానుండగా, కమల్ హాసన్‌‌‌‌తో కలిసి నటిస్తున్న ‘ఇండియన్‌‌‌‌ 2’ షూటింగ్ జరుగుతోంది.