పోలీస్ ఆఫీసర్‌‌‌‌గా కాజల్ అగర్వాల్ .. సత్యభామ వేట మొదలు

పోలీస్ ఆఫీసర్‌‌‌‌గా కాజల్ అగర్వాల్ .. సత్యభామ వేట మొదలు

కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌‌లో నటిస్తున్న  లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  ‘మేజర్’ డైరెక్టర్ శశికిరణ్ తిక్క సమర్పణలో ఆయన సోదరుడు బాబీ తిక్క, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. దీపావళి  కానుకగా ఈ మూవీ టీజర్‌‌‌‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో టైటిల్ రోల్ పోషించిన కాజల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌గా  ఇంటెన్స్‌‌ లుక్‌‌లో ఇంప్రెస్ చేస్తోంది. 

హత్యకు గురైన ఓ యువతిని రక్షించే క్రమంలో ఆమె ప్రాణాలు కాపాడలేకపోతుంది సత్యభామ. అప్పటి నుంచి ఆమె గిల్టీ ఫీలింగ్‌‌తో బాధపడుతుంటుంది. ఈ కేసు తన చేతుల్లో లేదని పై అధికారులు చెప్పగా, ఆ ప్రాణం నా   చేతుల్లోనే పోయిందని చెబుతూ.. హంతకుల కోసం వేటాడుతూ యాక్షన్ సీక్వెన్స్‌‌లో కనిపించింది కాజల్.

నరకాసుర వధ కోసం యుద్ధరంగంలో అడుగుపెట్టిన సత్యభామ సాహసంతో పోల్చుతూ శ్రీచరణ్ పాకాల అందించిన  బ్యాక్‌‌గ్రౌండ్ సాంగ్ ఆకట్టుకుంది. ఈ కేసును క్లోజ్ చేసేది లేదన్న సత్యభామ.. యువతి హత్యకు కారణమైన హంతకులను చట్టం ముందు నిలబెట్టిందా లేదా అనే అంశాలతో  ఆసక్తికరంగా టీజర్ కట్ చేశారు.