సీత ట్రైలర్ : నా పేరు సీత నేను గీసిందే గీత

సీత ట్రైలర్ : నా పేరు సీత నేను గీసిందే గీత

తేజ డైరెక్షన్ లో కాజల్ లీడ్ రోల్ లో నటించిన సినిమా సీత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే శుక్రవారం సీత సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది యూనిట్. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటించిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఫైటింగ్‌, యాక్సిడెంట్‌ సీన్స్ తో ట్రైలర్‌ మొదలైంది. ‘నా పేరు సీత నేను గీసిందే గీత. ప్రాస బాగుంది కదా..’ అని కాజల్‌ చెప్పే డైలాగ్‌ విని.. ‘ఇది కంచుకే కంచులా ఉందిరా బాబూ..’ అంటూ తనికెళ్ల భరణి వణికిపోతూ అనడం నవ్వులు పూయిస్తోంది.

ఇందులో రామ్‌ (బెల్లంకొండ శ్రీనివాస్‌) అమాయకపు యువకుడిగా నటించాడు. అతన్ని సీతే (కాజల్‌) దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. సోనూసూద్‌ విలన్ గా కనిపించాడు. ‘రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం తప్పు కాదండి. రాముడి భార్యను ఎత్తుకెళ్లడం తప్పు’ అని ట్రైలర్‌ చివర్లో శ్రీనివాస్‌ చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఇందులో మన్నారా చోప్రా మరో హీరోయిన్ గా నటించగా.. అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.