కళకళలాడుతున్న కళావతి..!

కళకళలాడుతున్న కళావతి..!

ఈ మధ్య సాంగ్ హిట్ అయిందని తెలుసుకోవడానికి యూట్యూబ్ వ్యూస్ యే కొలమానం అయింది. ఎన్ని మిలియన్లు వస్తే అంత హిట్. అల వైకుంఠపురంలో నుండి ఈ కాంపిటేషన్ ఎక్కువైంది. ఇప్పుడు లేటెస్ట్ గా ‘‘కళావతి’’ సాంగ్  పెద్ద హిట్ అయింది. ఇది మహేష్ బాబు కెరీర్లోనే ఎక్కువ వ్యూయ్స్ సాధించిన సాంగ్. అందుకే ఆయన ఫ్యాన్స్ ఖుషీలో ఉన్నారు. సర్కారువారి పాటకు తమన్ మ్యూజిక్. తన స్టైల్లో ‘‘కళావతి’’ సాంగ్ ను బాగా కంపోజ్ చేశాడు. ఈ సాంగ్ లో మహేష్ డాన్స్ స్టెప్ కూడా బాగా వైరల్ అయింది. సిద్ శ్రీరామ్ గొంతు ఇంకా ప్లస్ అయింది. అందుకే ఈ సాంగ్ అంత పాపులర్ అయింది. కాకపోతే రిలీజైన మూడు సాంగ్స్ లో ఇదొక్కటే బాగా హిట్ అయింది. ఇంకో మాస్ సాంగ్ ఉంది. అది ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. మే 12న రిలీజవుతున్న సర్కారు వారి పాట మీద భారీ అంచనాలున్నాయని టాక్.