Kalki 2898 AD: కల్కి వేట మొదలు.. రిలీజ్కు ముందే RRR రికార్డ్స్ అవుట్

Kalki 2898 AD: కల్కి వేట మొదలు.. రిలీజ్కు ముందే RRR రికార్డ్స్ అవుట్

ప్రస్తుతం ఇండియా మొత్తం కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD) సినిమా కోసం చూస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన కల్కి ట్రైలర్ ఆ అంచనాలను రెండింతలు చేసింది. ట్రైలర్ లో షాట్స్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ చాల రిచ్ గా అండ్ క్వాలిటీగా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మేకర్స్ కూడా ట్రైలర్ లో చూసింది టెన్ పెర్సెంట్ అని సినిమా చూశాక ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవుతుంది అని కామెంట్స్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని రేకెత్తిస్తున్నారు. దాంతో.. జూన్ 27న విడుదల కానున్న  ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని, ఈ నేపధ్యంలో ప్రీవియస్ రికార్డ్స్ బద్దలవడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అయితే.. విడుదలకు ముందే కల్కి సినిమా తన రికార్డుల వేటను మొదలుపెట్టేసింది. తాజా సమాచారం మేరకు అమెరికా ప్రీ బుకింగ్స్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ ను దాటేసింది. అవును.. అమెరికాలో తక్కువ సమయంలో వన్ మిలియన్ కలెక్షన్ క్రాస్ చేసిన సినిమా కల్కి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రికార్డ్ ముందు ఆర్ఆర్ఆర్ పేరుమీద ఉండేది. ఇప్పుడు ఆ సినిమా రికార్డ్ ను బద్దలుకొట్టేసింది కల్కి. రానున్న రోజుల్లో ఈ నెంబర్ ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. 

ఇక కల్కి సినిమా విషయానికి వస్తే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా అశ్విని దత్ నిర్మిస్తున్నారు. దాదాపు రూ.700 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తుండగా.. బిగ్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ కీ రోల్స్ చేస్తున్నారు. మరి ఇన్ని ప్రత్యేకతలు మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.