Kalki Ticket Rates: తెలంగాణాలో పెరిగిన కల్కి సినిమా టికెట్ ధరలు

Kalki Ticket Rates: తెలంగాణాలో పెరిగిన కల్కి సినిమా టికెట్ ధరలు

ప్రస్తుతం దేశంలోని సినీ లవర్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ. పాన్ ఇండియా ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ఈ భారీ సినిమాపై నెక్స్ట్ లెవల్ హైప్ ఉంది. ఇండియన్ మైథాలజీ కాన్సెప్ట్ తో స్కైఫై ఫ్యూచరిస్టిక్ సినిమాగా వస్తున్న కల్కి జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రూ.650 కోట్లకు పైగా ఖర్చుపెట్టి తీస్తున్న ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించారు. ఇక టీజర్, ట్రైలర్ లో విజువల్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఇదే విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా.. జూన్ 27 నుంచి జూలై 4 వరకు అంటే ఎనిమిది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులు బాటు కల్పించింది. ఇక జూన్ 27న ఉదయం 5:30 గంటలకు బెన్‌ఫిట్ షోకి కూడా అనుమతిచ్చారు. 
అంతేకాదు.. ఐదు రోజుల పాటు రోజుకి ఐదు షోలు వేసుకునేలా అనుమతిని ఇచ్చారు.

ఇక టికెట్‌పై రూ.200 మించకుండా పెంచుకోవచ్చని అవకాశాన్ని కల్పించారు. ఇక పెరిగిన ధరల ప్రకారం.. సింగల్ థియేటర్లలో రూ.70, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.100 పెంచనున్నారు. దాని ప్రకారం.. సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో రూ.377, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.495 రూపాయలుగా టికెట్ ధరల ఉండనున్నాయి.