కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్.. విడాకులు తీసుకున్నారా?

కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్.. విడాకులు తీసుకున్నారా?

మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ- కల్యాణ్‌ దేవ్‌ ల విడాకుల మ్యాటర్ గురించి గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసందే. అయితే ఈ వార్తలపై ఇరు కుంటుంబాలు నుండి ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు కానీ.. శ్రీజ- కల్యాణ్‌ దేవ్‌ కలిసి కనిపించి చాలా కాలమే అయ్యింది. ఇక తాజాగా కళ్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ ఒకటి వీరి విడాకుల వార్తలను కన్ఫర్మ్ చేసేలాగే కనిపించింది. 

తాజాగా కళ్యాణ్ దేవ్ తన ఇంస్టాలో.. " 'వారంలో ఎంతో ఆనందంగా గడిపే నాలుగు గంటలు ఇవే" అని పోస్ట్ పెట్టాడు. దానికి తన కూతురితో ఉన్న ఫోటోను కూడా యాడ్ చేశాడు. సాధారణంగా ఏ దంపతులైనా విడాకులు తీసుకుంటున్నప్పుడు కోర్టు పిల్లల బాధ్యత ఎవరికి ఇవ్వాలి? తల్లి లేదా తండ్రి దగ్గర ఎంత సమయం ఉండాలి అనేది నిర్ణయిస్తుంది. ఇందులో భాగంగానే కల్యాణ్‌ దేవ్‌ వారంలో కేవలం నాలుగు గంటలు మాత్రమే తన పిల్లలతో గడుపుతున్నట్లు ఆయన పెట్టిన పోస్ట్ చూస్తే అర్థమవుతుంది.

ఇక ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు కల్యాణ్‌కు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. 'నీ పిల్లలతో నువ్వు ఉండేది నాలుగు గంటలేనా?, "మీరు మళ్లీ కలిసే అవకాశమే లేదా" అని కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.