నకిలీ ప్రపంచంలో జీవిస్తున్నాం.. మెగా అల్లుడి పోస్ట్ వైరల్

నకిలీ ప్రపంచంలో జీవిస్తున్నాం.. మెగా అల్లుడి పోస్ట్ వైరల్

మెగా అల్లుడు, చిరంజీవి(Chiranjeevi) చిన్న కూతురు శ్రీజ(Sreeja) భర్త కళ్యాణ్ దేవ్(Kalyan Dev) సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటారు. తన సినిమాలు, పర్సనల్ లైఫ్ కి సంబందించిన చాలా విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా కళ్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ ఒకటి ఆసక్తిని రేపుతోంది. ఎవరిని ఉద్దేశించి కళ్యాణ్ ఈ పోస్ట్ పెట్టి ఉంటారు అంటూ చెవులు కొరికేసుకుంటున్నారు నెటిజన్స్. 

ఇంతకీ కళ్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ ఏంటంటే.. "మనం నకిలీ ప్రపంచంలో జీవిస్తున్నాము. ఈ నకిలీ తనం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు’’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం కళ్యాణ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక విజేత(Vijetha) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్.. ఆ తరువాత చాలా గ్యాప్ తరువాత సూపర్ మచి(Super machi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక ఇటీవల  కిన్నెరసాని(Kinnerasani) అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్.. ఆ తరువాత నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 

ఈక్రమంలోనే శ్రీజ- కల్యాణ్ దేవ్ కూడా విడిపోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై ఇద్దరి నుండి అధికారిక ప్రకటన రాలేదు. ఈ కారణంగానే కళ్యాణ్ దేవ్ పెట్టిన ప్రతీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.