వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆదివారం (జులై5న) కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విషెస్ తెలియజేసి ఆకట్టుకున్నారు మేకర్స్.
ఈ పోస్ట ర్ లో కళ్యాణ్ రామ్ పండుగ వాతావరణంలో ఆకట్టుకునే ఫ్యామిలీ లుక్ తో కనిపిస్తూ సినిమాపై మరింత ఆసక్తి ని పెంచారు. తెల్లటి పంచె, కుర్తా ధరించి, మెడలో పూలదండతో స్టైలిష్ సన్గ్ గ్లాసెస్ పెట్టుకుని స్టెప్ వేస్తూ ఆయన కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. చిరునవ్వుతో ఉన్న ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అందంగా అలంకరించిన సంప్రదాయ ఇంటి నేపథ్యంలో, రంగురంగుల పూలతోరణాలు, ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న మహిళల మధ్య రూపొందించిన ఈ పోస్టర్ పండుగ వాతావరణాన్ని సూచిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ విడుదలతో మరో విశేషం కూడా చోటు చేసుకుంది. ఈ పోస్టర్ ని షేర్ చేయడానికి కళ్యాణ్ రామ్.. 'నందమూరికళ్యాణ్ రామ్' పేరుతో ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టారు.
Team #VenkyAnil5 #NKRAR2 wishes their beloved @NANDAMURIKALYAN a very Happy Birthday ❤️🔥
— Shine Screens (@Shine_Screens) July 5, 2026
Presenting him in his most stylish avatar yet with unmatched elegance and swagger💥
#HappyBirthdayNKR ✨
SANKRANTHI 2027 Release.
Victory @VenkyMama @AnilRavipudi @KeerthyOfficial… pic.twitter.com/znmUJZn4gB
'అనిల్ రావిపూడి జోన్ లో ఉండటం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది.. సంక్రాంతి 2027కి ఒక భారీ ఎంటర్టైనర్ కు సిద్ధంగా ఉండండి' అంటూ ఆయన చేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో వెంకటేష్ కు జంటగా కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్ కు జోడీగా కృతి శెట్టి కనిపించనుంది.సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
