అగ్రెసివ్‌‌‌‌గా కనిపిస్తా : కామాక్షి భాస్కర్ల

అగ్రెసివ్‌‌‌‌గా కనిపిస్తా : కామాక్షి భాస్కర్ల

డాక్టర్‌‌‌‌‌‌‌‌ చదివిన కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌‌‌‌గా వరుస సినిమాలు చేస్తోంది. సత్యం రాజేష్‌‌‌‌కు జంటగా ఆమె నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర2’. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కామాక్షి మాట్లాడుతూ ‘ఫస్ట్ పార్ట్‌‌‌‌లో చాలా ఓర్పుగా ఉండే పాత్ర చేశా. ఇందులో లక్ష్మి పాత్రలో అగ్రెసివ్‌‌‌‌గా కనిపిస్తా. మంచి స్క్రీన్‌‌‌‌ప్లే బేస్డ్ మూవీ ఇది.  

ప్రతి 15 నిమిషాలకు ఒకసారి థ్రిల్ చేస్తూ ముందుకెళుతుంది.  ఫస్ట్ పార్ట్ చూడకపోయినా దీనికి కనెక్ట్ అయ్యేలా కథను డిజైన్ చేశారు అనిల్.  ప్రతి పాత్రకు ఇందులో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇందులో నటిస్తూనే, అసిస్టెంట్ డైరెక్టర్‌‌‌‌గానూ చేశాను. భవిష్యత్తులో దర్శకత్వం కూడా చేస్తా. ప్రస్తుతం.. మాన్షన్ హౌస్ మల్లేష్, ధూత సినిమాల్లో నటిస్తున్నా.  ‘పొలిమేర 3’ కూడా ఉంటుంది’ అని చెప్పింది.