బెజవాడలో భారతీయుడు 2 : సేనాప‌తిపై క‌ర్ర‌లు, రాళ్ల‌తో దాడి..

బెజవాడలో భారతీయుడు 2 : సేనాప‌తిపై క‌ర్ర‌లు, రాళ్ల‌తో దాడి..

గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే క్లర్క్ నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో చూపించిన చిత్రం భారతీయుడు. ఈ మూవీకి సీక్వెల్ గా వస్తోన్న భారతీయుడు 2 మూవీని శంకర్ ఎంతో ప్రేస్టీజియస్ ఫిల్మ్గా తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 

లేటెస్ట్ అప్డేట్ మేరకు భారతీయుడు2 మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ మూవీలోని కీలకమైన యాక్షన్ సీన్స్ను..విజయవాడలోని అలంకార్ సెంటర్ వద్ద చిత్రీకరిస్తున్నారు. ఈ స‌న్నివేశాల కోసం డైరెక్టర్ శంక‌ర్ భారీ ఎత్తున జ‌నాల్ని షూటింగ్ స్పాట్కి తీసుకొస్తున్నట్లు సమాచారం. 

చుట్టూ వేలాది మందికి పైగా జనం..మధ్యలో కమల్ హాసన్ (సేనాప‌తి) పై క‌ర్ర‌లు..రాళ్ల‌తో దాడి. ఎలాగైన సేనాప‌తిని అంతమొందించాలని  శ‌త్రుమూక‌లంతా ఏక‌మ‌వ్వడం..వాళ్ల దాడికి ప్రతి దాడిగా సేనాపతి తిరిగి ఎదురించే సీన్స్ని షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్కి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈ ఫైట్ సీన్స్ను హ‌డావుడి లొకేష‌న్లో చిత్రీక‌రించాల్సిన అవసరం మేరకు..భారీగా జ‌నాల త‌ర‌లింపు త‌ప్ప‌డం లేదని తెలుస్తోంది..నిన్న శుక్ర‌వారం ఒక్క‌రోజు క‌మ‌ల్ పై అత్యంత కీల‌క‌మైన సీన్స్ షూట్ చేశారని సమాచారం.

ఈ మూవీ వరుస షూటింగ్స్ కోసం విజయవాడ, విశాఖ పట్నం వంటి నగరాల్లో కీల‌క స‌న్నివేశాలు తీయనున్నట్లు సమాచారం. అందుకోసం విశాఖ‌ ఆంధ్రాయూనివ‌ర్శిటీలో కొన్ని ముఖ్యమైన సీన్స్ ను తెరకెక్కించబోతున్నట్లు టాక్. ఇప్పటికే షూటింగ్ పర్మిషన్ కూడా లభించినట్లు తెలుస్తోంది. 

1996 భారతీయుడు మూవీలో కమల్ హాసన్ ఇండియా వదిలి..విదేశాలకు వెళ్లిపోయినట్లు చూపించారు శంకర్. అలాగే మళ్ళీ ఇండియాలో అన్యాయం జరిగితే తప్పకుండా తిరిగి వస్తానని..తనకి మరణం అనేది లేదని చూపించారు.రిలీజ్ చేసిన టీజర్ లో..ఆ ఇంట్రో స్టార్ట్ చేసి భారతీయుడు గుర్తుకు చేసే ప్రయత్నం చేశారు శంకర్.