బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లు కంగనా రనౌత్, తాప్సీ పన్ను మధ్య చాలాకాలంగా కొనసాగుతున్న మాటల యుద్ధం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల తాప్సీ చేసిన వ్యాఖ్యలకు కంగనా ఘాటుగా స్పందించడంతో ఈ వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సీ పన్ను మాట్లాడుతూ.. కంగనాతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, తామిద్దరం ఇప్పటివరకు ముఖాముఖిగా కలుసుకోలేదని చెప్పింది. తన అభిప్రాయాలు, ఆలోచనా విధానం తన పెంపకాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొంది. ఎవరి పెంపకం ఎలాంటిదో ప్రజలే నిర్ణయించుకోవచ్చని వ్యాఖ్యానించింది.
కంగనా రనౌత్ ఫైర్..
అయితే తాప్సీ చేసిన ‘పెంపకం’ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించింది. తన తల్లిదండ్రులను, తన పెంపకాన్ని ఈ వివాదంలోకి తీసుకురావడం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా, తన కుటుంబ నేపథ్యాన్ని, చిన్నతనం నుంచి తాము ఎదుర్కొన్న కష్టాలను తక్కువ చేసి మాట్లాడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి బాలీవుడ్ లో హీట్ పెంచేసింది. ఈ క్రమంలో గతంలో తన సోదరి రంగోలి చందేల్ ఉపయోగించిన ‘సస్తీ కాపీ’, ‘బి-గ్రేడ్ నటి’ అనే పదాన్ని కూడా కంగనా మరోసారి ప్రస్తావించింది. అంతేకాకుండా, తాప్సీ తల్లిదండ్రులను ఉద్దేశించి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
Kangana Ranaut hit back at Taapsee Pannu over her remarks about Kangana’s upbringing, calling her a “sasti copy” in an Instagram Story. Kangana defended her parents and background while criticising Taapsee for allegedly dragging her family into their ongoing differences.
— Mid Day (@mid_day) August 23, 2026
Kangana… pic.twitter.com/Wxu3ldgBQy
“పిల్లల కోసం ప్రతి తల్లిదండ్రులు తమ శక్తిమేర కష్టపడతారు. నేను ఎప్పుడూ ఇతరుల తల్లిదండ్రుల గురించి మాట్లాడను. కానీ, ఈరోజు తాప్సీ తల్లిదండ్రులను ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. నా తల్లిదండ్రుల్లా ఒక ఒరిజినల్ వ్యక్తికి ఎందుకు జన్మనివ్వలేకపోయారు? ఇలాంటి చీప్ కాపీని ఎందుకు కన్నారు? ఈ విషయం తెలిసి ఆమె తల్లిదండ్రులపై నాకు జాలేస్తోంది” అంటూ కంగనా ఘాటుగా వ్యాఖ్యానించారు. కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చేసిన ఈ పోస్టులను కొద్ది గంటలకే డిలీట్ చేసింది. అయితే అప్పటికే వాటి స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే ఆమె చేసిన కొన్ని పోస్టులు కొద్దిసేపటికే సోషల్ మీడియాలో కనిపించకుండా పోయాయి.
వివాదం ఎక్కడ మొదలైంది?
కంగనా–తాప్సీ మధ్య వివాదానికి 2019లోనే బీజం పడింది. కంగనా నటించిన ఓ సినిమా ట్రైలర్‌ను తాప్సీ ప్రశంసించినప్పటికీ, కంగనా పేరును ప్రస్తావించకపోవడంతో వివాదం మొదలైంది. దీనిపై కంగనా సోదరి రంగోలి చందేల్ స్పందిస్తూ.. తాప్సీని ‘కంగనాకు సస్తీ కాపీ’ అంటూ విమర్శించారు.
ఆ తర్వాత 2020లో బాలీవుడ్‌లో నెపోటిజం అంశంపై తీవ్ర చర్చ జరిగిన సమయంలో కంగనా.. తాప్సీ పన్ను, స్వరా భాస్కర్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిని ‘బి-గ్రేడ్ నటీమణులు’, ‘నీడీ అవుట్‌సైడర్స్’ అంటూ విమర్శించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది.
అయితే ఈ వివాదంపై తాప్సీ మాత్రం పలుమార్లు తన వైఖరిని స్పష్టం చేసింది. తాను ఎప్పుడూ కంగనాకు వ్యతిరేకంగా వ్యక్తిగతంగా మాట్లాడలేదని, తామిద్దరి మధ్య ప్రత్యక్ష ఘర్షణ కూడా జరగలేదని చెప్పింది. అంతేకాకుండా, కంగనాతో స్నేహం చేయడానికి కూడా తాను సిద్ధమేనని గతంలో పేర్కొంది.
सांसद और एक्ट्रेस कंगना रनौत ने इंस्टाग्राम स्टोरी पर तापसी पन्नू को क्या ही बोल दिया...
— DINESH K SEN (@dks_230) August 23, 2026
👉 “एक सस्ती कॉपी अपनी आने वाली बी-ग्रेड फिल्म के प्रमोशन में घूम रही है... लेकिन मीडिया की हेडलाइन हमेशा कंगना रनौत ही बनती है”
और फिर तापसी के पैरेंट्स को भी ..
“मैं कभी किसी के… pic.twitter.com/Infncmm1WR
బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులుగా కంగనా రనౌత్, తాప్సీ పన్ను నిలిచారు. అయితే కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ, వీరిద్దరి మధ్య గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న మాటల యుద్ధం మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ప్రస్తుతం తాప్సీ నటించిన ‘గాంధారి’ మూవీ సెప్టెంబర్ 3న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.
