Kannappa Movie: కన్నప్పలో కంగన? సాహసం చేస్తున్న మంచు విష్ణు

Kannappa Movie: కన్నప్పలో కంగన?  సాహసం చేస్తున్న మంచు విష్ణు

మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం కన్నప్ప(Kannappa). మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకం లోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌, మోహన్‌బాబు, ప్రభాస్‌ తదితరులు నటిస్తున్నారు. న్యూజిలాండ్‌లో లాంగ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న మూవీ యూనిట్ ఇండియా వచ్చింది.

ఈ మూవీలో ప్రభాస్ శివుడిగా, నయనతార పార్వతిగా నటిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో నయన్ భాగమవ్వడంలేదట. ఆమె డేట్స్ సెట్ కావడం లేదంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో పార్వతిగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana Ranaut) నటించనందని తెలుస్తోంది. నయనతార డేట్స్ దొరక్కపోవడంతో కంగనను మేకర్స్ సంప్రదించారట. అందుకు ఆమె కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో కంగన..తనకు ఓ తెలుగు చిత్రంలో పార్వతీ దేవి రోల్ ఆఫర్ వచ్చిందని చెప్పింది. మూడు-నాలుగు రోజుల షూట్ ఉంటుందని చెప్పింది. భక్త కన్నప్ప కోసమే అప్పుడు కంగన చెప్పిందని నెటిజెన్లు అంటున్నారు.  కన్నప్ప చిత్రాన్ని ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది చివరలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది