నిద్రలోనే చనిపోయిన ఫైట్ మాస్టర్..

నిద్రలోనే చనిపోయిన ఫైట్ మాస్టర్..

సినిమా ఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ కన్నడ ఫైట్ మాస్టర్ జాలీ బాస్టియన్ (57) కన్నుమూశారు. ఆయన బెంగుళూర్ లోని తన నివాసంలో నిద్రలోనే కార్డియాక్ అరెస్ట్ తో(గుండెపోటు) చనిపోయారు. జాలీ బాస్టియన్ చిత్ర రంగంలో ఫైట్ మాస్టర్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఫైట్ మాస్టర్ గా పనిచేశాడు.

ఈయన 900కి పైగా చిత్రాలకు పనిచేశాడు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య మూవీకి, కృష్ణవంశీ నక్షత్రం మూవీకి పని చేశాడు. గాల్లో బైకులు, భారీ వాహనాలను, అలాగే తాడులతో హీరోలను అవలీలగా ఫైట్స్ చేయించడంలో జాలీ మాస్టర్ పనితీరు ఉన్నతంగా ఉంటుంది. ఆయన మృతిపై పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు 

జాలీ మాస్టర్ సినిమాలను చూసుకుంటే ఎక్కువ సినిమాలు హై రిస్క్ తో కూడుకున్నవే  ఉండటంతో..ఇతన్ని రియల్ హీరో అని కన్నడ ఇండస్ట్రీలో పిలిచేవారు.