
బెంగళూరు: ప్రముఖ కన్నడ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం చెందారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఉన్నట్టుండి గుండె పోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. సడెన్‌గా హార్ట్ అటాక్ తో కుప్పకూలిన ఆయన్ని బంధువులు అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే చిరంజీవి గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతని వయసు 39 సంవత్సరాలు. చిరంజీవి ప్రముఖ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు. ఆయన ఇప్పటివరకూ 19 సినిమాల్లో నటించారు.
1980 అక్టోబరు 17న బెంగళూరులో జన్మించిన చిరంజీవి సర్జా తొలి నాళ్లలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత నటుడిగా మారారు. అతని సోదరుడు నటుడు ధ్రువ సర్జా కన్నడనాట హీరోగా రాణిస్తున్నారు. చిరంజీవి సర్జాకు రెండేళ్ల క్రితమే వివాహమైంది. నటి మేఘనా రాజ్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. చిరంజీవి సర్జా ఆకస్మిక మరణంతో కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.