సుమలత వర్సెస్ సీఎం కొడుకు : కన్నడ సినీ ఇండస్ట్రీలో వేడెక్కిన రాజకీయం

సుమలత వర్సెస్ సీఎం కొడుకు : కన్నడ సినీ ఇండస్ట్రీలో వేడెక్కిన రాజకీయం

కన్నడ పరిశ్రమలో పాలిటిక్స్ యమ ఇంట్రెస్టింగ్‌ గా మారాయి. తన భర్త అంబరీష్ ప్రాతినిత్యం వహించిన మాండ్య పార్లమెంట్‌ నుంచి ఎన్నికల బరిలోకి దిగేందుకు సుమలత రంగం సిద్ధం చేసుకొంటున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కూడా రెడీ అవుతున్నాడు. దాంతో ఈ నియోజకవర్గం క్రేజీగా మారింది. సుమలతకు మద్దతిచ్చేందుకు కొందరు సినీ నటులు, నిఖిల్ వైపు మరికొందరు జట్లుగా చిలీపోతున్నారు

నటి సుమలతకు యువ హీరో దర్శన్, నిర్మాత రాక్‌ లైన్ వెంకటేస్, సీనియర్ నటుడు దొడ్డన్న మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా హీరో దర్శన్ మాట్లాడుతూ.. గతంలో అప్పాజీ (అంబరీష్)‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. అందుచేత ఈ సారి కూడా అమ్మ (సుమలత)కు నేను మద్దతు ఇవ్వాలని అనుకొంటున్నాను. పార్టీలకతీతంగా గతంలో నా సన్నిహితులకు సపోర్ట్ చేశాను అని అన్నారు.