ఎట్టకేలకు కొత్త సినిమా అనౌన్స్ చేసిన యష్.. టైటిల్ ఏంటో తెలుసా?

ఎట్టకేలకు కొత్త సినిమా అనౌన్స్ చేసిన యష్.. టైటిల్ ఏంటో తెలుసా?

కన్నడ స్టార్ యశ్(Yash) కేజీఎఫ్ (KGF) సినిమాలతో నేషనల్ వైడ్ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా విజయం యష్ ను ఇండియాస్ టాప్ స్టార్స్ లిస్టులో నిలబెట్టింది. దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కన్నడ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

అయితే యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ సినిమా వచ్చి సంవత్సరం దాటేసింది. ఇంత బ్లాక్ బస్టర్ తరువాత ఆయన నుండి వెంటనే మరో సినిమా వస్తుందని ఆశపడ్డారు యష్ ఫ్యాన్స్ కానీ.. కానీ ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేయలేదు ఈ మాస్ హీరో. దీంతో యష్ నెక్స్ట్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు ఆయన ఫ్యాన్స్. 

తాజాగా తన అభిమానుల ఎదురుచూపులు పులిష్టాప్ పెడుతూ నెక్స్ట్ సినిమాపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు యష్. ఇదే విషయాన్నీ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు యష్. KVN ప్రొడక్షన్స్ నిర్మించనున్న తన 19వ సినిమాను ప్రకటించాడు. ఈ సినిమా టైటిల్ డిసెంబర్ 8 ఉదయం 9 గంటల 55 నిమిషాలకు ప్రకటించనున్నట్టు అప్డేట్ ఇచ్చారు యష్. అదేరోజు సినిమా డైరెక్టర్ ను కూడా రివీల్ చేయనున్నారు. చాలా కాలంగా తమ అభిమాన హీరో నుండి వచ్చిన అప్డేట్ తో యశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి కేజీఎఫ్ లాంటి భారీ సక్సెస్ తరువాత యష్ నుండి వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.