రామ్‌‌ చరణ్‌‌ సినిమాలో.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌

రామ్‌‌ చరణ్‌‌ సినిమాలో..  కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌

రజినీకాంత్ సినిమా ‘జైలర్‌‌‌‌’లో కనిపించింది కాసేపు అయినప్పటికీ కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌‌‌‌కు ఆ పాత్ర ఎంతో పేరు తెచ్చింది. త్వరలో విడుదల కానున్న ధనుష్‌‌ సినిమా ‘కెప్టెన్‌‌ మిల్లర్‌‌‌‌’లోనూ ఆయన కీరోల్ చేశారు. తాజాగా రామ్ చరణ్‌‌ సినిమాలోనూ ఆయన నటించబోతున్నారు. చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఓ కీలకపాత్రను శివరాజ్ కుమార్ పోషిస్తున్నారు. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. ఆరేళ్ల క్రితం బాలకృష్ణ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో శివన్న నటించారు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఆయన తెలుగు సినిమాలో నటించబోతున్నారు. సమ్మర్‌‌‌‌లో ఈ మూవీ సెట్స్‌‌కు వెళ్లనుంది. ‘ఉప్పెన’లో విజయ్ సేతుపతిని నెగెటివ్ క్యారెక్టర్‌‌‌‌లో చూపించిన దర్శకుడు బుచ్చిబాబు.. ఈ సినిమాలో శివన్నను ఎలాంటి పాత్రలో చూపించనున్నాడో అనే ఆసక్తి నెలకొంది.