
మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మైథలాజికల్ మూవీ కన్నప్ప. శుక్రవారం (జూన్ 27)న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలో తొలిరోజు కన్నప్ప ఎలాంటి వసూళ్ళు సాధించిందనే విషయంపై సినీ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఇండియా వైడ్‌గా కన్నప్ప ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం.
ట్రెడింగ్ వెబ్ సైట్ సాక్నిల్క్ ప్రకారం..
కన్నప్ప మూవీ ఇండియావైడ్‌గా ఫస్ట్ డే రూ.9 కోట్లకు పైగా నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులోనే అత్యధికంగా రూ.8 కోట్లు నెట్ సాధించింది. అయితే, గతంలో విష్ణు నటించిన చాలా సినిమాలు వాటి మొత్తం రన్లో రూ.10 కోట్లు కూడా వసూలు చేయలేదు.
ఇపుడీ కన్నప్ప తొలిరోజు రూ.9కోట్లకు పైగా ఓపెనింగ్ సాధించడంతో.. ఇదే విష్ణు కెరీర్లో అత్యధికంగా నిలిచింది. ఇకపోతే, నేడు (జూన్ 28న) గ్రాస్ వసూళ్ల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఓవరాల్ కలెక్షన్స్ చూసుకుంటే.. తెలుగులోరూ.8కోట్లు, తమిళంలో రూ 0.1cr, హిందీలో 0.6, కన్నడంలో 0.1, మలయాళంలో 0.15 వసూళ్లు చేసినట్లు సాక్నిల్క్ తెలిపింది.
తొలిరోజు తెలుగు వెర్షన్ 55.89% ఆక్యుపెన్సీ నమోదు చేసుకుని ఆధిక్యంలో ఉంది. ఉదయం షోలు 50.55%తో బలంగా ప్రారంభమవ్వగా.. మధ్యాహ్నం 50.34%, సాయంత్రం 52.81% మరియు రాత్రి షోలలో 69.87% గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
కన్నప్ప రిలీజ్ ముందు అంచనా!
కన్నప్ప ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేస్తుందని మేకర్స్ ముందుగా భావించారు. ఇండియాలో, తెలుగు వెర్షన్ రూ.16 కోట్ల నెట్ వసూళ్లు రాబడుతుందని, హిందీ వెర్షన్ IMDb ప్రకారం తొలి రోజు రూ.4 కోట్లు, కన్నడ, తమిళ్, మలయాళంలో రూ.1 కోటి రూపాయల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ, అందుకు భిన్నంగా కన్నప్ప వసూళ్లు సాధించింది.
కన్నప్ప పబ్లిక్ టాక్:
ఈ సినిమాలో మంచు విష్ణుతోపాటు ఇతర నటీనటుల యాక్టింగ్ చాలా బాగుందని రివ్యూవర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా బావుందని, మంచు విష్ణు, ప్రభాస్ లు ఈ సినిమాను వేరే లెవెల్ కు తీసుకువెళ్లారని ఆడియన్స్ అంటున్నారు. ఇందులో విష్ణు తిన్నడు పాత్ర పోషించాడు. తల్లీతండ్రి తప్ప మరో దైవం లేరని చెప్పేవాడు తిన్నడు. ఆ తిన్నడు కన్నప్పగా ఎలా మారాడో తెలియజెప్పే సీన్స్‌కు అద్భుత స్పందన వస్తోంది. కన్నప్ప భక్తి తీవ్రతకు, ముఖ్యంగా భావోద్వేగభరితమైన క్లైమాక్స్‌కు కంటతడి ఆడియన్స్ పెడుతున్నారు. మరి ఈ వీకెండ్ కన్నప్ప ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.