
టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్.. ఇలా ఏ ఇండస్ట్రీ తీసుకున్న నటనకు ప్రాణమిచ్చే నటులుంటారు. అందులో కొందరు అందంగా నటిస్తారు. మరి కొందరు నటనకి కొత్త నిర్వచనం ఇస్తారు. ఇంకొందరు అయితే.. అసలు నటనంటే అదే అన్నంతగా మెప్పిస్తారు. ఈ మూడు దశలనూ దాటి మెగాస్టార్ అయ్యారు హీరో మమ్ముట్టి(Mammootty). బేసిగ్ గా మమ్ముట్టి మలయాళ నటుడే అయినప్పటికి ఇతర భాషల్లోనూ ఆయన మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా.. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఎంతోమందికి ఫేవరేట్ యాక్టర్ అయ్యారు.
లేటెస్ట్ గా మమ్ముట్టి నటిస్తూ..నిర్మించిన చిత్రం కన్నూర్ స్క్వాడ్(Kannur Squad). గత నెల 2023 సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమా.. రిలీజై మూడు వారాలైనా..కేరళలో దుమ్ము దులిపేస్తుంది. కేరళలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన కన్నూర్ స్క్వాడ్ సినిమాను రాబీ వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించారు.
క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుని.. మమ్ముట్టి కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆసక్తికరమైన కథ, కథనాలతో సాగుతూ..క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ లో వచ్చిన బెస్ట్ మూవీస్ లో నెం.1 స్థానం ఉంటుందని సినీ క్రిటిక్స్ భావిస్తున్నారు. IMDb లో 8.9/10 రేటింగ్ తో శభాష్ అనిపించుకుంది. రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన మూవీ.. వరల్డ్ వైడ్‌గా రూ.75 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
మమ్ముట్టి..మలయాళంలో మెగాస్టార్. అయినా సరే ఇప్పటికీ విభిన్నమైన కథలతో సరికొత్త సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కన్నూర్ స్క్వాడ్ మూవీ థియేటర్స్ లో రిలీజైన..నాలుగు వారాల తర్వాత వస్తుందని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. దీంతో ఈ మూవీ త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా అక్టోబర్ 28న లేదా నవంబర్ ఫస్ట్ వీక్ లో వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ని సోనీ లైవ్ దక్కించుకుందని గతంలో న్యూస్ వినిపించిన..ఇంకా అధికారిక ప్రకటన ఖరారు చేయలేదు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం..ఈ మూవీ డిస్నీ+హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా మమ్ముట్టి తెలుగులో యాత్ర, ఏజెంట్ వంటి సినిమాల్లో నటించారు.