రాజ్ అండ్ డీకే ఫిల్మ్‎లో సల్మాన్‌‌కు జంటగా కరీనా కపూర్

రాజ్ అండ్ డీకే ఫిల్మ్‎లో సల్మాన్‌‌కు జంటగా కరీనా కపూర్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, ప్రముఖ దర్శకులు రాజ్ అండ్ డీకే కాంబినేషన్‌‌లో ఒక భారీ బడ్జెట్ చిత్రం రూపొందనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో సల్మాన్ సరసన కథానాయికగా కరీనా కపూర్ ఖాన్ నటించబోతున్నట్టు తెలుస్తోంది.  డిఫరెంట్ కాన్సెప్ట్‌‌ రూపొందబోయే ఈ చిత్రంలో రిటైర్ అయిన సూపర్ హీరో పాత్రలో సల్మాన్ కొత్త లుక్‌‌లో కనిపించబోతున్నారు. తనకు జంటగా కరీనా కపూర్ కనిపించబోతోంది. ఈ పాత్ర కోసం గత కొంతకాలంగా సమంత పేరు వినిపిస్తోంది. 

అయితే సల్మాన్ మాత్రం కరీనా కపూర్‌‌‌‌ను సూచించినట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్,  అతుల్ అగ్నిహోత్రి నిర్మించనున్న ఈ చిత్రం ఈ ఏడావి చివర్లో సెట్స్‌‌కు వెళ్లబోతోంది. క్యోన్‌‌ కీ,  మై ఔర్ మిసెస్‌‌ ఖన్నా, బాడీ గార్డ్‌‌,  బజరంగీ భాయిజాన్‌‌ చిత్రాల్లో సల్మాన్‌‌, కరీనా కలిసి నటించారు.  అలాగే సల్మాన్ హీరోగా వచ్చిన ‘దబాంగ్‌‌ 2’లో స్పెషల్ సాంగ్ చేసింది. ఇక రాజ్ అండ్ డీకే సినిమా ఓకే అయితే దాదాపు 11 ఏళ్ల తర్వాత ఐదోసారి మళ్ళీ సల్మాన్‌‌కు జంటగా కనిపించనుంది కరీనా.