కరీంనగర్ మున్సిపల్ కాంప్లెక్స్ లోని షాపులకు వేలం.. 44 షాపులు, బ్యాంకెట్ హాల్.. డార్క్ సూట్ రూం

కరీంనగర్ మున్సిపల్ కాంప్లెక్స్ లోని షాపులకు వేలం.. 44 షాపులు, బ్యాంకెట్ హాల్.. డార్క్ సూట్ రూం

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ నగరపాలక సంస్థకు చెందిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్,  మున్సిపల్ గెస్ట్ హౌస్ ఐడీఎస్ ఎంటీ షాపులకు అధికారులు మంగళవారం బహిరంగ వేలం నిర్వహించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 19 షాపులు, మొదటి అంతస్తులోని బ్యాంకెట్ హాల్, రెండో అంతస్తులోని డార్క్ సూట్ రూమ్ లు మొత్తం భవన సముదాయాన్ని వేలంలో రావుల రమేశ్ దక్కించుకున్నారు. 

ప్రతి నెలా నగరపాలక సంస్థకు రూ.99,400 చెల్లించేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అంతేగాక ఐడీఎస్ఎంటీ నూతన షాపింగ్ కాంప్లెక్స్ లోని  25 షాపులు, గ్రౌండ్ ప్లోర్ లోని పార్కింగ్ కలిపి మొత్తం భవన సముదాయాన్ని జంగిలి సతీశ్ కుమార్ వేలంలో ప్రతి నెలా నగరపాలక సంస్థకు రూ.6.10 లక్షలు చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నారు.