
బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త, సోనా కామ్‌స్టార్ ఛైర్మన్ సంజయ్ కపూర్ హఠాత్తుగా మరణించారు. UKలో (JUNE12న) పోలో మ్యాచ్ ఆడుతుండగా సంజయ్ కపూర్ ఆకస్మిక గుండెపోటుతో 53 సంవత్సరాల వయసులో మరణించారు.
అయితే, సంజయ్ కపూర్ మరణానికి కేవలం ఆరు గంటల ముందు, అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలోని బాధితులకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.
అంతలోనే సంజయ్ కపూర్ కన్నుమూయడంతో ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు, దేశ పారిశ్రామిక రంగం శోకసంద్రంలో మునిగిపోయింది. తన మనసుని కలిచి వేసిన సంగటనకు సంతాపం తెలిపిన అనంతరమే.. ఆయనకు మరణం సంభవించడం మరింత విషాదకరంగా మారింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సంజయ్ ట్వీట్:
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై.. సంజయ్ కపూర్ సోషల్ మీడియా ద్వారా విచారం వ్యక్తం చేస్తూ సానుభూతి తెలిపారు.
" అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం భయంకరమైన వార్త. బాధిత కుటుంబాలందరితో నా ఆలోచనలు మరియు ప్రార్థనలు ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో వారు ధైర్యాన్ని, శక్తిని పొందాలని కోరుకుంటున్నాను🙏 #planecrash" అని సంజయ్ కపూర్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
Terrible news of the tragic Air India crash in Ahmedabad. My thoughts and prayers are with all the families affected. May they find strength in this difficult hour. 🙏 #planecrash
— Sunjay Kapur (@sunjaykapur) June 12, 2025
ఆ విషాదకరమైన యాదృచ్చికం అతని ట్వీట్ తో ముగియలేదు. కొన్ని గంటల తర్వాత, ఇంగ్లాండ్లో పోలో మ్యాచ్లో పాల్గొంటూ సంజయ్ కపూర్ కుప్పకూలి చనిపోయాడు.
Little did Sunjay know when he was posting the above message as well as this below just three days back that his own time has come.
— RS (@WithRitesh) June 12, 2025
Om Shanti! 🙏 pic.twitter.com/CoHcP9kYH8
సంజయ్ కపూర్ ఎలా చనిపోయాడంటే?
UKలో జూన్ 12న పోలో గేమ్ ఆడారు సంజయ్ కపూర్. అలా సంజయ్ కపూర్ గుండెపోటుతో మరణించారని ముందుగా నేషనల్ మీడియాలో వార్తలొచ్చాయి. కానీ, సంజయ్ కపూర్ మరణానికి తేనెటీగ కూడా కారణం కావచ్చని మరో న్యూస్ వైరల్ అవుతుంది.
On to the quarter-finals of the Queens Cup! 💪🏻💪🏻💪🏻
— Sunjay Kapur (@sunjaykapur) June 4, 2025
Aureus Polo🇮🇳 vs. Suján Indian Tigers🐅
A super thrilling match that went into extra time. We clinched it with a golden goal, final score 13–12 in a nail-biting finish.💥#QueensCup #Polo #AureusPolo #Teamwork #Sport… pic.twitter.com/ZnX4fV85YI
అయితే, గుర్రంపై ఉండగా సంజయ్ కపూర్ అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు తేనెటీగను మింగినట్లు కొన్ని వార్తా ప్రసారాల్లో వచ్చాయి. అలా తేనెటీగను మింగడంతో అస్వస్థతకు గురైన సంజయ్ కపూర్ కింద పడిపోయారు. అదే అతని గుండెపోటుకు దారి తీసిందని తెలుస్తోంది. అయితే, తేనెటీగ వల్లే సంజయ్ ప్రాణాలు కోల్పోయారా విషయంపై వైద్యుల నుంచి ఎలాంటి స్పష్టత ఇంకా రాలేదు.
Sunjay Kapur, industrialist and ex-husband of Karisma Kapoor, has passed away at the age of 53 due to a heart attack. The incident reportedly occurred during a polo match in the UK. He is survived by his wife Priya Sachdev and their children.#SunjayKapur #KarismaKapoor pic.twitter.com/XZwntuTSQZ
— TheFansWorld (@TeamTFW) June 12, 2025
సంజయ్ కపూర్ ఎవరు?
ప్రఖ్యాత పారిశ్రామికవేత్త డాక్టర్ సురీందర్ కపూర్ కుమారుడే.. ఈ సంజయ్ కపూర్. ఇతను కూడా ఒక ప్రసిద్ధ భారతీయ వ్యాపారవేత్త మరియు సోనా గ్రూప్ వ్యవస్థాపకుడు. భారతదేశ ఆటో కాంపోనెంట్స్ రంగంలో ప్రముఖ వ్యక్తి అయిన సంజయ్, ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ఇతర వాహన తయారీదారులకు కీలకమైన వ్యవస్థలు మరియు భాగాలను సరఫరా చేసే గ్లోబల్ ఆటోమోటివ్ టెక్నాలజీ కంపెనీ సోనా కామ్‌స్టార్‌కు ఛైర్మన్‌గా పనిచేశారు.
అయితే, తన కార్పొరేట్ విజయాలకు మించి, సంజయ్ కపూర్ తన వ్యక్తిగత జీవితం కోసం తరచుగా ప్రజల దృష్టిలో ఉండేవాడు. అతను గతంలో బాలీవుడ్ నటి కరిష్మా కపూర్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ ఇద్దరూ 2003లో వివాహం చేసుకుని 2016 లో విడాకులు తీసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. సమైరా మరియు కియాన్. ఆ తర్వాత అతను మోడల్ మరియు వ్యవస్థాపకురాలు ప్రియా సచ్‌దేవ్‌ను వివాహం చేసుకున్నాడు.