‘కార్మేని సెల్వం’ హృదయానికి హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

‘కార్మేని సెల్వం’ హృదయానికి హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో   తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’.  విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.  లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్  ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 

మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్ అంటూ మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరుతో  రామానుజన్ ఎంకే తమ సంస్థ ద్వారా ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన ‘అరెరె’ పాట ఎమోషనల్‌గా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది.  ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం   గ్రాండ్  థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది.  ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా  ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతుంది.  ఈ సందర్భంగా సంగీతం దర్శకుడు రామానుజన్ ఎంకే చిత్ర విశేషాల గురించి ఇలా వివరించారు. 

‘‘ఒక చిత్రానికి సంగీతాన్ని అందించిన ఘనత ఏ ఒక్క వ్యక్తికీ కాకుండా, ఒక సంస్థకు దక్కాలని కోరుకున్నాం. అందుకే   2017లో బెంగళూరులో  ‘Musicloud Studio & Technology’ని ప్రారంభించాను. మొదట్లో కార్పొరేట్ ప్రాజెక్టులను స్వీకరిస్తూ, నెమ్మదిగా నా పనితీరును  మెరుగుపరుచుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత మీడియా సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ప్రారంభించాను. మేము సౌండ్ డిజైన్, వాయిస్‌ఓవర్లు మరియు డబ్బింగ్ వంటి అన్ని సేవలను  అందించాము. 

ప్రస్తుతం ‘కార్మేని సెల్వం’  ప్రాజెక్టును విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం.  ఈ సినిమాకు సంగీతం దర్శకుడి పేరు కాకుండా.. (మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్) మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరును ప్రకటించాం.  ప్రస్తుతం సినిమా నిర్మాణ వ్యయం రోజురోజుకూ పెరిగిపోతోంది.  మంచి కథాంశాలను  ప్రోత్సహించాలంటే, నిర్మాణ వ్యయాన్ని తప్పనిసరిగా తగ్గించాల్సి ఉంది. ఆ దిశగా అడుగులు వేయడానికి ఉన్న మార్గాలలో ఒకటి సంగీత నిర్మాణానికి అయ్యే ఖర్చును తగ్గించాలనుకుని ఈ చిత్రం విషయంలో  ఇలా ప్లాన్ చేశాం. ఇటువంటి సేవను వినియోగించుకోవడం ద్వారా, చిత్ర నిర్మాతలకు మ్యూజిక్ క్లౌడ్ స్టూడియోకు మధ్య ఒక రెవెన్యూ మోడల్   రూపొందించబడింది.

ఈ ఆదాయ నమూనా కింద, సౌండ్ ఇంజనీర్లు, వాయిద్యకారులు, ప్రోగ్రామర్లు సహా  ఈ ప్రక్రియలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ రాయల్టీలో వాటా లభిస్తుంది.  మేము సంగీత నిర్మాణానికి ఒక కార్పొరేట్ నిర్మాణాన్ని తీసుకు వస్తున్నాము. సినీ  సంగీత రంగంలో ఇదొక  కొత్త ప్రభంజనం అనుకోవచ్చు.  నేను గతంలో దర్శకుడు రామ్‌తో కలిసి అమృత శ్రీనివాసన్ ప్రధాన పాత్ర పోషించిన 'కురైయొండ్రుమ్ ఇల్లై' చిత్రానికి పనిచేశా. ఇప్పుడు ‘కార్మేని సెల్వం’ లాంటి గొప్ప   ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రానికి సంగీతం అందించే అవకాశం వచ్చింది.

డైరెక్టర్ రామ్ చక్రి గారితో పరిచయం నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అయ్యింది.  “కార్మేని సెల్వం” సినిమా కోసం  4 పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, OST ట్రాక్స్ కంపోజ్ చేశాను. ఇది ఒక టీమ్ ఎఫర్ట్. మా Music Cloud టీమ్‌లో 4-5 మంది కలిసి పనిచేస్తున్నాం. సంగీతం ఎప్పుడూ ఒక వ్యక్తి పని కాదు అది టీమ్ వర్క్. ‘అరెరె’ పాటకు తెలుగులో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.  తండ్రి-కొడుకు మధ్య బంధాన్ని చూపించే సందర్భంలో ఈ పాట వస్తుంది. ఇందులో  వైలిన్, ఫ్లూట్ బదులు సరంగి ఉపయోగించాలనే ఆలోచన వచ్చింది.  అది భావోద్వేగాన్ని మరింత బలంగా చూపించింది.

సముద్రఖని గారు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు నాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. ఎమోషనల్, ఫ్యామిలీ సినిమాలకు మ్యూజిక్ చేయడం చాలా కష్టం.  ప్రొడ్యూసర్ అరుణ్ రంగరాజులు గారు చాలా సపోర్టివ్, సింపుల్ వ్యక్తి. ఆయన అందరి పనిని గమనిస్తూ ప్రోత్సహిస్తారు. కనీసం 10 మంచి, అర్థవంతమైన సినిమాలకు మ్యూజిక్ ఇవ్వాలని నా కోరిక. నేను ఎవరితోనూ పోల్చుకోను. మంచి కథలు, మంచి సినిమాల్లో భాగం కావడం నా లక్ష్యం.  తెలుగులో “హ్యాపీ డేస్”, “ఆనంద్”, “గోదావరి” లాంటి ఫీల్-గుడ్ సినిమాలకు మ్యూజిక్ చేయాలని ఉంది. చివరగా, “కార్మేని సెల్వం” ఒక హృదయానికి హత్తుకునే సినిమా. మన జీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది. నా పేరు కంటే నా సంగీతమే ప్రేక్షకుల హృదయాల్లో నిలవాలని కోరుకుంటున్నాను". 

  • విడుదల తేది: ఏప్రిల్ 3, 2026
  • నటీనటులు: సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ తదితరులు.
  • సాంకేతిక బృందం: బ్యానర్: పాత్‌వే ప్రొడక్షన్స్
  • నిర్మాత: అరుణ్ రంగరాజులు
  • కథ – దర్శకత్వం: రామ్ చక్రి
  • క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రీ శరవణన్
  • మ్యూజిక్: MAAS (Music as a Service), Musicloud Studio & Technology
  • డీఓపీ: యువరాజ్ దక్షన్
  • ఎడిటింగ్: జగన్ ఆర్వీ, దినేష్ ఎస్
  • ప్రొడక్షన్ డిజైనర్: శంకర్
  • లిరిక్స్: మణి అముతవన్, ఉమా దేవి
  • ఆడియోగ్రఫీ: రాఘవ్ రమేష్
  • సౌండ్ డిజైన్: రాఘవ్ రమేష్ – హరి ప్రసాద్ MA
  • ఎగ్జిక్యూటివ్ మేనేజర్: మణి దామోతథరన్
  • ప్రొడక్షన్ మేనేజర్: వీఆర్ రాంభరత్
  • మార్కెటింగ్: నాని కాంచనపల్లి - జయరాజ్ గేదెల
  • పిఆర్‌ఓ: జీకే మీడియా (గణేష్ – కుమార్)